ఆగస్ట్ 27న వరుణ్ సందేశ్ మిస్టర్ 420 ఆడియో రిలీజ్, సెప్టెంబర్ 9న సినిమా విడుదల
యూత్ లో వరుణ్ సందేశ్ కు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమ కథా చిత్రాల్లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఎంటర్ టైన్ చేస్తున్న వరుణ్ సందేశ్ తన కెరీర్లోనే మరో విభిన్న ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. అదే మిస్టర్ 420. సాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై గజ్జల హరికుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.రవి కుమార్ దర్శకుడు. వరుణ్ సందేశ్ సరసన ప్రియాంక భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర విశేషాల్ని చిత్ర నిర్మాత హరి కుమార్ రెడ్డి తెలిపారు.
మా మిస్టర్ 420 చిత్ర షూటింగ్ అనుకున్నట్టుగా శరవేగంగా జరుగుతోంది. మా చిత్ర హీరో వరుణ్ సందేశ్ ఇటీవలే మ్యారేజ్ చేసుకున్నారు. మా చిత్ర యూనిట్ తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మ్యారేజ్ తర్వాత చాలా మంది హీరోలు సూపర్ సక్సెస్ లు అందుకున్నారు. అలాగే మా హీరో వరుణ్ సందేశ్ కు కూడా మిస్టర్ 420 సూపర్ హిట్ చిత్రంగా నిలవబోతుందని గర్వంగా చెబుతున్నాను. ఎందుకంటే చిత్ర కథ, కథనం విభిన్నంగా ఉండబోతోంది. దానికి తగ్గట్టుగా వరుణ్ సందేశ్ డిఫరెంట్ లుక్ తో స్టైలిష్ గా కనిపించబోతున్నారు. దర్శకుడు రవి కుమార్ సినిమాను అనుకున్నట్టుగా పూర్తి చేస్తున్నారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఈ మధ్య వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ ఫాంలో ఉన్నారు. మిస్టర్ 420లోనూ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. మోహన్ చంద్ర డైలాగ్స్ చాలా బాగుంటాయి. రియాన్ ముస్తఫా ఫ్రెష్ ట్రెండీ మ్యూజిక్ అందించాడు. కెమెరామెన్ జశ్వంత్ రిచ్ గా చిత్రీకరించారు. సినిమా అంతా కలర్ ఫుల్ గా చూపించారు. చంద్రబోస్, అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం కథను డ్రైవ్ చేసేలా ఉంటాయి. నందు స్టంట్స్ ని డిఫరెంట్ గా... కాన్పెప్ట్ ఓరియెంటెడ్ గా కంపోజ్ చేశారు. రఘు, స్వర్ణ, శేఖర్, సుధీర్ మాస్టర్స్ కొరియోగ్రఫీ తో పాటలకు స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చింది. చితర్ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆగస్ట్ 27న తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో ఆడియో విడుదల చేస్తున్నాం, సెప్టెంబర్ 9న గ్రాండ్ గా సినిమా విడుదల చేయనున్నాం. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం. అని అన్నారు.
నటీనటులు
వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్, సాయాజి షిండే, రఘు బాబు, పృథ్వీ (30 ఇయర్స్), సాయి (ఈరోజుల్లో) షాని, శేఖర్ (ఛత్రపతి), జీవా, రఘు కారమంచి, రచ్చ రవి, మీనా
టెక్నీషియన్స్
కొరియో గ్రాఫర్ - రఘు, స్వర్ణ, శేఖర్, సుధీర్
స్టంట్స్ - నందు
లిరిక్స్ - చంద్రబోస్, అనంత శ్రీరామ్
ఎడిటింగ్ - నందమూరి హరి
సినిమాటోగ్రాఫర్ - జశ్వంత్
మ్యాజిక్ - రియాన్ ముస్తఫా
డైలాగ్స్ - మోహన్ చంద్ర
డైరెక్టర్ - ఎస్.ఎస్.రవికుమార్
ప్రొడ్యూసర్ - హరికుమార్ రెడ్డి గజ్జల