సింధు సాధించిన విజయం తెలుగు జాతికే గర్వకారణం!
-నందమూరి బాలకృష్ణ
21 ఏళ్ల చిరుప్రాయంలో భారతీయ జాతిపతాక గౌరవాన్ని ప్రపంచపు నలుమూలలా వ్యాపింపజేయడంతోపాటు తెలుగు వారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మన తెలుగు వనిత కుమారి పి.వి.సింధుని గౌరవించుకోవడం తెలుగు వారిగా, భారతీయులుగా మన కర్తవ్యం. తొలి ప్రయత్నంలోనే "ఒలింపిక్" పతాకం అందుకొన్న మొట్టమొదటి యువతిగా రికార్డ్ సృష్టించిన సింధు మరెందరో స్ఫూర్తిగా నిలిచింది.
మా బసవతారకం ఆసుపత్రిలో నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు విశిష్ట అతిధిగా విచ్చేసిన సింధు నేడు ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడుతుండడం నాకెంతో సంతోషాన్నిస్తోందని నందమూరి బాలకృష్ణ తెలిపారు!
This website uses cookies.