ఆది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం `చుట్టాలబ్బాయి` - నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి
ఆది, నమిత ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ బ్యానర్స్‌పై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మించిన సినిమా -చుట్టాలబ్బాయి
. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం చక్కని రివ్యూస్ ను దక్కించుకుంది. మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న చుట్టాలబ్బాయి చక్కని కామెడీ ఎంటర్ టైనర్ గా అని వర్గాల వారిని అలరిస్తుంది. ఆది కరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే 350 థియేటర్ లలో రిలీజ్ కాగా తాజాగా.. అటు ఆంధ్రా, ఇటు నైజాంలోను రిలీజైన అన్ని చోట్లా థియేటర్ ల సంఖ్యను పెంచనున్నారు. అన్ని ఏరియాలు కలుపుకుని దాదాపు 100 థియేటర్లను పెంచుతున్నామని నిర్మాతలు తెలిపారు. రిలీజైన ప్రతి సెంటర్ లోను హౌస్‌ఫుల్ కలోక్షన్లతో ప్రదర్శించబడుతున్న చుట్టాలబ్బాయి ఆది కెరీర్‌ర్ ని మలుపు తిప్పే చిత్రమని పంపిణీదారులు చెబుతున్నారు. ఈరోజు విజయోత్సాహంలో చుట్టాలబ్బాయి
టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని నిర్వహించింది. ఈ సక్సెస్‌మీట్‌లో
డైలాగ్‌కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ -ఈ శుక్రవారం మా చుట్టాలబ్బాయి 350 థియేటర్లలో రిలీజైంది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రమిది. ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకు థాంక్స్. ప్రథమార్థం ఆహ్లదకరమైన ఎంటర్‌టైన్‌మెంట్, ద్వితీయార్థంలో నా ఎంట్రీ, పృథ్వీ, అలీ కామెడీ ఆకట్టుకున్నాయని ప్రేక్షకుల నుంచి ప్రశంసలొస్తున్నాయి. ఆది చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్‌లో నటించాడు. చాలా స్మార్ట్‌గా కనిపించాడంటూ మెచ్చుకుంటున్నారు. ఆదితో నా కాంబినేషన్ సీన్స్ బాగా వర్కవుటయ్యాయి. కథానాయిక నమిత ప్రమోద్ ఇప్పటికే 12 సినిమాల్లో నటించిన కథానాయిక. తన నటనకు చక్కని ప్రశంసలొచ్చాయి. ఓ చక్కని ఎంటర్‌టైనర్‌ని కమర్షియల్ పంథాలో తెరకెక్కించడంలో వీరభద్రమ్ ప్రతిభను మెచ్చుకోవాలి. ప్రారంభ రోజే మంచి టాక్ వచ్చింది. ఇదో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ అంతా మెచ్చుకోవడం సంతోషాన్నిచ్చింది. ఇంతటి విజయం దక్కడానికి మా నిర్మాతల కృషే కారణం. నిర్మాణ విలువల్లో రాజీకి రాకుండా తెరకెక్కించారు. ప్రమోషన్‌లోనూ ఎంతో బాగా చేశారు. ప్యాషన్ ఉన్న నిర్మాతలు కనుకే ఈ విజయం దక్కింది
అన్నారు.
దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ -చుట్టాలబ్బాయి తొలి టీజర్ నుంచి అసలైన ఊపు వచ్చింది. ఆ తర్వాత వ్యాపారపరంగా హుషారొచ్చింది. టీజర్ వల్ల పెద్ద బిజినెస్ అయ్యింది. తర్వాత ఆడియో అంతే పెద్ద విజయం సాధించింది. తమన్ సంగీతం పెద్ద ప్లస్. ఎక్కడికి వెళ్లినా మా చుట్టాలబ్బాయి పాటలు వినిపిస్తున్నాయ్. అహనా పెళ్లంట, పూలరంగడు తర్వాత సూపర్‌హిట్ రావాలని ఎదురు చూశాను. భాయ్ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్లీ పెద్ద కమర్షియల్ హిట్ .. చుట్టాలబ్బాయి. ఈ సినిమాకి నైజాంతో పాటు అన్నిచోట్లా రెస్పాన్స్ బావుంది. ముఖ్యంగా ఆది నటనకు స్పందన బావుంది. నా నిర్మాతలు రియల్ హీరోస్. నాపై నమ్మకంతో ఓ చక్కని అవకాశం ఇచ్చారు. అరుణ్ ఫోటోగ్రఫీ, తమన్ సంగీతం, భవానీ మాటలు పెద్ద అస్సెట్ అయ్యాయి. ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి ఉంది. అయినా నా నిర్మాతలు పెద్ద రిలీజ్ చేశారు. అందుకోసం ఎంతో శ్రమించారు. ఇక మూవీ ద్వితీయార్థంలో సాయికుమార్ ఎంట్రీ బావుందన్న ప్రశంసలొచ్చాయి. అలాగే పృథ్వీ కామెడీ హైలైట్ గా ఉందంటున్నారు. సినిమాకి తొలిరోజు టెర్రిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి. నా సినిమాల్లో అహనా పెళ్లంట, పూలరంగడుని మించి పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది
అన్నారు.
నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ -ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. పంపిణీదారులంతా అదనంగా థియేటర్లు పెంచాలని అడిగారు. 50 నుంచి 100 థియేటర్ల వరకూ పెంచుతున్నాం. 350 థియేటర్ల నుంచి 450 థియేటర్లకు వెళుతోంది మా సినిమా. నిర్మాతగా తొలి ప్రయత్నమే అయినా ది బెస్ట్‌గా ఈ సినిమాని తెరకెక్కించాం. మంచి సినిమాకి ప్రేక్షకాదరణ దక్కుతుందని ఈ సినిమాతో ప్రూవైంది. హీరో ఆది పెర్ఫామెన్స్‌కి చక్కని ప్రశంసలొస్తున్నాయి. అలాగే కథానాయిక నమిత ప్రమోద్ ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. కామెడీ, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ అందరికీ కనెక్టయ్యింది. రిలీజైన మొదటిరోజునే అన్ని ఏరియాలు కలుపుకుని రూ.2.5 కోట్ల గ్రాస్ వచ్చింది. 2,3 రోజుల్లోనే సేఫ్ ప్రాజెక్టు అవుతుంది. ఈ సక్సెస్ ను ఓ మంచి సినిమాకి దక్కిన ఆదరణగా మేం భావిస్తున్నాం
అన్నారు.
మరో నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ -నిర్మాతగా మొదటి సినిమా ఇది. పరిశ్రమలో చుట్టాల్లేకపోయినా అందరి ప్రోత్సాహం దక్కింది. తొలిరోజు నైజాం నుంచి చక్కని రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ 35-40 థియేటర్లు పెంచుతున్నాం. సీడెడ్‌లో 20 పైగా థియేటర్లు, ఈస్ట్‌లో 50 థియేటర్లు అదనంగా పెంచుతున్నాం. తొలి మూడు రోజుల్లోనే వసూళ్ల పరంగా సేఫ్‌జోన్‌కి వచ్చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది
అన్నారు.
పంపిణీదారులు కిషోర్, రాకేష్, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ -చుట్టాలబ్బాయి చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సాయికుమార్, ఆది నటనకు చక్కని ప్రశంసలొస్తున్నాయి. ఇదో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఈ టీమ్ అంతా చక్కని హ్యూమన్‌బీయింగ్స్. ఇప్పటికంటే మరో మూడు రెట్ల వసూళ్లు దక్కుతాయన్న నమ్మకం ఉంది. రేపట్నుంచి థియేటర్ల సంఖ్యను పెంచుతున్నాం
అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ -మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీ. నిర్మాతలు చక్కని ప్రమోషన్ కూడా చేశారు. ఇదో హిలేరియస్ ఎంటర్‌టైనర్ అన్న ప్రశంసలు వస్తున్నాయి. పృథ్వీ మిస్టర్ ఈగో క్యారెక్టర్‌లో చక్కగా నవ్వించాడు. నేను-నమిత చేసిన చాలా సీన్స్ బావున్నాయన్న టాక్ వచ్చింది. వీరభద్రమ్ చక్కగా తెరకెక్కించారు. నేను చాలా స్టైలిష్‌గా కనిపించానని అన్నారు. కాస్ట్యూమ్స్‌కి కాంప్లిమెంట్స్ వచ్చాయి. కుటుంబ సమేతంగా అందరూ ఆస్వాదించే చిత్రమిది. థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి
అన్నారు.
బి.ఎ.రాజు మాట్లాడుతూ -ఆది కెరీర్‌లో ప్రేమకావాలి, లవ్‌లీ తర్వాత మళ్లీ అంతకుమించిన బిగ్గెస్ట్ హిట్ -చుట్టాలబ్బాయి. తెరపై సాయికుమార్, ఆది కనిపిస్తే కన్నుల పండువే. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా తీసే అవకాశం, అదృష్టం వీరభ్రమ్‌కే దక్కింది. కొందరు ప్రయత్నించినా కుదరలేదు. వెంకట్, రామ్ చక్కని ప్యాషన్ ఉన్న నిర్మాతలు. కొత్త అయినా మంచి హిట్ కొట్టాలన్న ధ్యేయంతో ఈ సినిమా తీశారు. ఆ ఫలితం అందుకున్నారు. ఈసారి ఆది- సాయికుమార్ పూర్తి స్థాయి మల్టీస్టారర్‌లో కనిపించాలని కోరుకుంటున్నా. కీ.శే పి.జె.శర్మ గారు ఓ ఫోటోలో కనిపించడం బావుంది. మరో సక్సెస్‌మీట్‌లో కలుద్దాం
అన్నారు.
నమిత ప్రమోద్ మాట్లాడుతూ -ఇలాంటి చక్కని ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు దర్శకనిర్మాతలకు థాంక్స్
అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ -చుట్టాలబ్బాయి కలెక్షన్స్ బావున్నాయి. మునుముందు మరింతగా పెరగనున్నాయి. సక్సెస్ తో చాలా సంతోషంగా ఉంది
అన్నారు.