Social News XYZ     

Press Release: Avasaraniko Abaddam on August 26th

అగ‌ష్టు 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న స‌ర్‌ప్రైజింగ్ థ్రిల్ల‌ర్‌ 'అవసరానికో అబద్ధం'

Press Release: Avasaraniko Abaddam on August 26th

నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పిందెవరు? అబద్దమని నువ్వు అనుకొనే దాన్ని అబద్దమని నీకు చెప్పిందెవరు? అనే ఆలోచనకు ప్రతి రూపమే అవసరానికో అబద్ధం అనే చిత్రమంటున్నారు చిత్ర దర్శకుడు సురేష్ కె.వి. 'అవసరానికో అబద్ధం' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయడంతో ఈ చిత్రానికి టాలీవుడ్ లో భారీ క్రేజ్ దక్కింది. ఈ చిత్రం సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకొని అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా ఈనెల 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కి సిధ్ధ‌మైంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సినిమా విశేషాల్ని పంచుకుంది.... అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ ను త్రివిక్రమ్ గారు రిలీజ్ చేసిన తర్వాత మేం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇంత రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలోని డైలాగ్స్ గురించి త్రివిక్రమ్ గారు మమ్మల్ని పొగడడం చాలా సంతోషాన్నిచ్చింది. డైలాగ్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడు మా చిత్రం డైలాగ్స్ గురించి ప్ర‌స్తావించ‌టం మా అదృష్టం గా భావిస్తున్నాం. ఇక మాపై ఉన్న నమ్మకంతో చిత్రాన్ని నిర్మించిన నా స్నేహితులకు... సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా రావడానికి కృషి చేసిన మా టీంకు, సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రమోషనల్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్న శ్రియాస్ మీడియాకు కృతజ్ఞతలు తెలిజయేస్తున్నాం. నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పిందెవరు? అబద్దమని నువ్వు అనుకొనే దాన్ని అబద్దమని నీకు చెప్పిందెవరు? అనే ఆలోచనకు ప్రతి రూపమే అవసరానికో అబద్ధం. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలోని సన్నివేశాలు అందరినీ కట్టిపడేసేలా చిత్రీక‌రించామని సెన్సారు స‌భ్యులు ప్ర‌శంసించడం విశేషం. అగ‌ష్టు 26న మా చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము. .. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. . అని అన్నారు.

 

బ్యానర్ - చక్రం క్రియేషన్స్
నటీనటులు - లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి, సందీప్, వెంకీ, ఎంజిఆర్, గిరిధర్, మురళి, విజయ్ తదితరులు
సినిమాటోగ్రఫి - వెంకటరమణ ఎస్
సంగీతం - సాయి కార్తిక్
ఎడిటింగ్ - కార్తిక్ శ్రీనివాస్
డిఐ - శ్రీనివాస్ మామిడి
ఎఫెక్ట్స్ - యతిరాజ్
లైన్ ఎడిటింగ్ - అజయ్ బి
డిటిఎస్ మిక్సింగ్ - రాజశేఖర్
ఆర్ట్ - కిరణ్
ప్రమోషనల్ పార్ట్ నర్ - శ్రియాస్ మీడియా
రచన దర్శకత్వం - సురేష్ కెవి
నిర్మాతలు - విజయ్.జె, పులి శ్రీకాంత్, సందీప్ మరియు స్నేహితులు

Facebook Comments