Social News XYZ     

Chuttalabbayi is a complete family entertainer : Poducers

అన్నీ ఎలిమెంట్స్ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `చుట్టాలబ్బాయి` - నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి

Chuttalabbayi is a complete family entertainer : Poducers

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ నేను అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. ఐటీ కన్సల్ టెంట్ నడుపుతున్నాను. అయితే సినిమాలంటే చాలా ఆసక్తి ఉండటంతో మంచి సినిమా ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సమయంలో వీరభద్రం చౌదరిగారిని కలిశాను. ఆయన అప్పుడు చుట్టాలబ్బాయి కథ చెప్పాడు. ఆది, శర్వానంద్, నాని వంటి హీరోలతో చేయాలకున్నాం. నాని, శర్వానంద్ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆదితోనే చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే దేవిశ్రీప్రసాద్, థమన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరితో మ్యూజిక్ చేయించాలని బాగా ఆలోచించాం. థమన్ సినిమాకు సెట్ అయ్యాడు. చాలా మంచి మ్యూజిక్ అందించాడు. రేసుగుర్రం తర్వాత ఆ రేంజ్ ఆల్బమ్ ఈ సినిమాకు కుదిరింది.  త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ కూడా ప్లాన్ చేస్తున్నాం. 18న ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోస్ పడుతాయి. 19న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరింది. విలేజ్, సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం. రాజమండ్రి, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం అన్నారు.

 

రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ నాకు కూడా ఐటీ కంపెనీతో పాటు పలు బిజినెస్ లున్నాయి. మంచి సినిమా చేయాలని రెండు సంవత్సరాలుగా మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మా కామన్ ఫ్రెండ్ వీరభద్రమ్ చౌదరిగారి వల్ల ఈ సినిమాకు మేం వర్క్ చేశాం. సినిమా అవుట్ పుట్ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. ఆదికి మంచి హిట్ మూవీగా నిలుస్తుంది. చెన్నై ఎక్స్ ప్రెస్ తరహాలో మంచి ఎంటర్ టైనింగ్ మూవీలా సాగిపోయే చిత్రం. సాయికుమార్ గారు పాత్ర సెకండాఫ్ లో చాలా హైలైట్ గా నిలుస్తుంది. సినిమాను వీరభ్రదమ్ గారు గతంలో ఆయన నిర్మించిన పూలరంగడు, అహ నా పెళ్ళంట తరహాలో వినోదాత్మకంగా తెరకెక్కించారు. మలయాళంలో సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నాం.నిర్మాణ పరంగా మాకు అనుభవం వచ్చింది. ఈ సినిమా మాకెంతో హెల్ప్ అయ్యింది. త్వరలోనే మూడు సినిమాలను ప్లాన్ చేస్తున్నాం. అది కలిసి చేస్తామా, వేర్వేరుగా చేస్తామా అనేది వారంలో తెలియజేస్తాం. ఇక చుట్టాలబ్బాయి సినిమా విషయానికి వస్తే సినిమాను అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాల్లో విడుదల చేస్తున్నాం. ఆది గత చిత్రాల కంటే ఎక్కువ థియేటర్స్ లో సినిమా విడుదల ఉంటుంది అన్నారు.

Facebook Comments

%d bloggers like this: