యంగ్ హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆటాడుకుందాం..రా'(జస్ట్ చిల్). ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుతో ఇంటర్వ్యూ....
చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాలు తర్వాత సుశాంత్ హీరోగా నిర్మించిన చిత్రం`ఆటాడుకుందాం..రా`. ఈ చిత్రంలో సుశాంత్ డిఫరెంట్ లుక్‌లో కనపడతాడు. ఆడోరకం-ఈడో రకం వంటి సక్సెస్ తర్వాత నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రాఖీ పండుగ సందర్భంగా ఆగస్ట్ 19న విడుదలవుతుంది. సినిమా ఫైనల్ అవుట్ పుట్ చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. అనూప్ ఎక్సలెంట్ మ్యూజిక్‌తో పాటు ఎక్సలెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. టైం మిషన్ సెట్ చూసి థ్రిల్ అయ్యాను. సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండగానే సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ఒక ఏరియాకి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు పోటీ పడ్డారు. మంచి బిజినెస్ అయ్యింది. శ్రీధర్ సీపాన ఇచ్చిన కథ మంచి ఎసెట్ అయ్యింది. ఇప్పటి వరకు సుశాంత్ చేసిన రోల్స్ కు డిఫరెంట్‌గా ఈ సినిమాలో కనపడతాడు. నాగేశ్వరరెడ్డిగారు సుశాంత్ దగ్గర నుండి విబిన్నమైన నటనను రాబట్టుకున్నాడు. సిసింద్రీ సినిమాలో నాగార్జునగారి పాటలోని పల్లవి సబ్జెక్ట్‌కు యాప్ట్ అయ్యేలా అనిపించింది. దాంతో ఆటాడుకుందాం..రా అనే టైటిల్ పెట్టాను. ఈ చిత్రంలో నాగచైతన్య, అఖిల్ నటించడం మరో హైలైట్. కథను మలుపు తిప్పే గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నాగచైతన్య కనపడతారు. అలాగే క్లైమాక్స్ సాంగ్ లో చిన్న బిట్‌లో అఖిల్ డ్యాన్స్ చేశారు. నాగచైతన్య, అఖిల్ నటించడం అనేది కథ రాసుకున్నప్పటి నుండే ఉంది. కథ విన్నప్పుడు వారిద్దరూ కూడా నటించడానికి అంగీకరించడం విశేషం. ఈ ముగ్గురి కాంబినేషన్ ప్రేక్షకులకు, అభిమానులకు కనువిందు చేస్తుంది. అలాగే అలనాటి క్లాసిక్ సాంగ్ పల్లెకు పోదాం..పారును చూద్దాం..సాంగ్‌ను కలర్‌ఫుల్‌గా అలనాటి స్మృతులను గుర్తుకు తెచ్చేలా ఉంటుంది. నిజానికి ఈ కథను శ్రీధర్ సీపాన నాకు మూడు నిమిషాల పాటు వివరించాడు. డైరెక్షన్ చేస్తానని అన్నాడు. నేను కూడా సరేనన్నాను. అయితే నాగేశ్వరరెడ్డికి మా బ్యానర్‌లో కమిట్‌మెంట్ ఉండటంతో ఓ కథతో నా దగ్గరకి వచ్చాడు. ఆయన కథ కంటే శ్రీధర్ సీపాన కథ నచ్చడంతో, నాగేశ్వరరెడ్డిగారు ఆ కథతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంటుంది. సుశాంత్ చాలా స్టైలిష్‌గా కనపడ్డాడు. సినిమా కథ ఎంత మేర డిమాండ్ చేసింద ఆ మేరనే బడ్జెట్‌ను ఖర్చు పెట్టాం. పృథ్వి,పోసాని, మురళీశర్మ, బ్రహ్మాంనదం ఇలా అందరూ టాప్ యాక్టర్స్ చిత్రంలో ఎంటర్ టైనింగ్ చేస్తారు. నాగేశ్వరెడ్డిగారు మంచి ప్లానింగ్ ఉన్న దర్శకుడు. చాలా క్లారిటీతో సినిమాను తెరకెక్కించాడు. సినిమా ఆగస్ట్ 19న విడుదలవుతుంది. అన్నీ రకాల ఎలిమెంట్స్ ఉన్న మంచి ఎంటర్ టైనర్. అక్కినేని అభిమానులకు పెద్ద పండుగలాంటి సినిమా అవుతుంది
అన్నారు.
This website uses cookies.