TAM’s 1st Anniversary

మేరీలాండ్ తెలుగు సంఘం (TAM) ఆవిర్భవించి నేటికి సరిగ్గా సంవత్సరం.

ఆగస్టు 15,2015 న మేరీలాండ్ పరిసర ప్రాంత తెలుగు ప్రజలకుతోచినంతలో చేయూత నివ్వడానికి చేయి చేయి కలిపి 100 మంది సభ్యులతో తొలి అడుగులు పడి అప్పుడే సంవత్సరం గడిచిందంటే ఆశ్చర్యంగాఉంది. చిట్టి అడుగులతో ప్రారంభమయినా...చిత్తశుధ్ధితో చేసిన ఎన్నో పనులు TAM ని మేరీలాండ్ తెలుగు ప్రజల హ్రుదయంలో నిలిపాయి.ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మచ్చుకు కొన్ని:

1) ఇస్కాన్ టెంపుల్ వారి సహకారంతో పిల్లల కొరకు వేద పాఠశాల నిర్వహణ

2) పిల్ల పాపలతో "మీ చేతులతో మీ గణేషుడు" కార్యక్రమం

3) తెలుగు వెలుగులు రాజేస్తూ, స్థానిక తెలుగు రచయితలను ప్రోత్సహిస్తూ త్రైమాసికంగా వెలువడే "TAM పత్రిక" స్థాపన

4) తానా వారి అనుబంధంతో పేద విద్యార్ధులకు స్కూలుకు సంబంధించిన వస్తువుల సహాయం

5) అమిరినేని ఫౌండేషన్ వారి సహకారంతో భారతదేశంలోని తెలుగు ప్రాంతాల్లో ఉచిత కేన్సర్ చెకప్

6) దసరా దీపావళి సంబరాలు

7) చెన్నై తుఫాను బాధితులకు సుబంధ సంస్థతో కలిసి సహాయ కార్యక్రమాలు

8) భారీ వర్షాల వల్ల నష్టపోయిన నెల్లూరు వాసులకు నిత్యావసర వస్తువులతో చేయూత

9) తానా సంస్థ సహకారంతో "బోన్ మారో డ్రైవ్" నిర్వహణ

10) సంక్రాంతి సంబరాలు

11) IONHOCO సౌజన్యంతో హోలీ వేడుకల నిర్వహణ

12) థమన్ సంగీత విభావరి

13) యువతీ యువకులకు బాడ్మింటన్ పోటీలు

14) చిన్నారులకు వేసవి పాఠశాల

TAM తొలి ప్రెసిడెంట్ శ్రీనివాస్ కూకట్ల గారి ఆధ్వర్యంలో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సహకారంతో, కోర్ కమిటీ నిరంతర శ్రమతో ఆకాశమే హద్దుగా.. సేవేధ్యేయంగా సాగిపోతున్న TAM సంస్థ, మీ అందరి ఆదరాభిమానలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ విజయాలన్నింటిలోనూ250 మంది జీవితకాల TAM సభ్యులందరి సహాయ సహకారాలు, వెన్నంటి నిలిచే స్పాన్సర్ల సహకారం మరువలేనివి.

ఇట్లు,

TAM కుటుంబం.

Facebook Comments
Share
%%footer%%