Social News XYZ     

Bhagyashree films to release Aadi’s Chuttalabbayi in Nizam

నైజాంలో భాగ్యశ్రీ ఫిలింస్‌ ద్వారా 'చుట్టాలబ్బాయి'

Bhagyashree films to release Aadi's Chuttalabbayi in Nizam

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. నైజాంలో భాగ్యశ్రీ ఫిలింస్‌ ద్వారా రాకేష్‌ ఈ చిత్రాన్ని 125 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ - ''చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మా 'చుట్టాలబ్బాయి' చిత్రాన్ని ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన భాగ్యశ్రీ ఫిలింస్‌ రాకేష్‌గారు మంచి ఫ్యాన్సీ ఆఫర్‌ ఇచ్చి నైజాం రిలీజ్‌ హక్కులను తీసుకున్నారు. నైజాంలో 125 థియేటర్లలో ఈ చిత్రాన్ని భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అలాగే అన్ని ఏరియాల్లో చాలా మంచి థియేటర్లలో మా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కుటుంబ సమేతంగా అందరూ చూసి ఎంజాయ్‌ చేసే విధంగా డైరెక్టర్‌ వీరభద్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆది పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రం రూపొందింది. ఆది, వీరభద్రమ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి మా బేనర్స్‌కి కూడా చాలా మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

 

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, బ్రహ్మానందం, పోసాని క ష్ణమురళి, ప థ్వి, రఘుబాబు, క ష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌.

Facebook Comments

%d bloggers like this: