Social News XYZ     

Nee Jathaleka promotional song launched at Radio City

నీ జతలేక' ప్రమోషనల్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల

Nee Jathaleka promotional song launched at Radio City

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా పారుల్‌, సరయు హీరోయిన్స్‌గా శ్రీ సత్య విదుర మూవీస్‌ పతాకంపై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్‌ గౌడ్‌ చిర్రా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'నీ జతలేక'. కరుణాకర్‌ కంపోజ్‌ చేసిన ఈ సినిమా ప్రమోషనల్‌ టైటిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ శనివారం హైదరాబాద్‌ రేడియో సిటీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా...

దర్శకుడు లారెన్స్‌ దాసరి మాట్లాడుతూ ''నీ జతలేక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. చూసే ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది. సిచ్యువేషనల్‌ కామెడితో సాగిపోతుంది. రీసెంట్‌గా విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించిన కరుణాకర్‌గారు ఈ సినిమాకు టైటిల్‌ సాంగ్‌ను అందించారు. మంచి ఎమోషనల్‌ ఫీల్‌ ఉంటుంది. గర్ల్‌ జెలసీ అనే కాన్సెప్ట్‌తో సాగే డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ'' అన్నారు.

 

నిర్మాత జి.వి.చౌదరి మాట్లాడుతూ ''మా సత్యవిదుర బ్యానర్‌లో విడుదలవుతున్న తొలి చిత్రమిది. సాంగ్స్‌కు చాలా మంచి స్పందన రావడం ఎంతో హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నాగశౌర్య, పారుల్‌, సరయు చక్కగా యాక్ట్‌ చేశారు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కరుణాకర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించాను. అయితే టైటిల్‌ సాంగ్‌ చేయాలనే ఆలోచన రాగానే దర్శక నిర్మాతలకు చెప్పాను. వారు ఒప్పుకోవడంతో టైటిల్‌సాంగ్‌ లిరిక్స్‌ రాయడమే కాకుండా ట్యూన్స్‌ కూడా కంపోజ్‌ చేశాను. కథలోని మెయిన్‌ పాయింట్‌ నచ్చడంతో దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని సాంగ్‌ను కంపోజ్‌ చేశాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత ఎ.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

నాగశౌర్య, పారుల్‌, సరయు, విస్సురెడ్డి, జయలక్ష్మి, అర్క్‌ బాబు, నామాల మూర్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: స్వరాజ్‌, సినిమాటోగ్రఫీ: బుజ్జి.కె, మాటలు: శేఖర్‌ విఖ్యాత్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, ఆర్ట్‌: సత్య, పాటలు: రామ్‌ పైడిశెట్టి, గాంధీ, కో డైరెక్టర్‌: బి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.శ్రీధర్‌, సమర్పణ: ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు, నిర్మాతలు: జి.వి.చౌదరి, నాగరాజు గౌడ్‌ చిర్రా, దర్శకత్వం: లారెన్స్‌ దాసరి.

Facebook Comments