జనతాగ్యారేజ్' ఆడియో ఆవిష్కరణ
యంగ్ఎ టైగర్ ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా, మోహన్ లాల్ ప్రధాన పాత్ర లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మో
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, చిత్ర దర్శకుడు కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, నిత్యామీనన్, సాయికు
ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు , ప్రసాద్ వి.పొట్లూరి, బి.వి.ఎస్.ఎన్.ప్
అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాను : ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ``ఏ జన్మలోనో నేను పుణ్యం చేసుకున్నాను. అందుకే మహానుభావుడు ఎన్టీఆర్‌కు మనవడిగా, గొప్ప తల్లిదండ్రులకు కొడుకు గా పుట్టాను. అందుకే ఇంత మంది అభిమానులు నాకు తోడయ్యారు. అభిమానుల రుణం తీర్చలేనిది. మీ రుణం తర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుట్టాలనిపిస్తుంది. పుడతానేమో. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. నా 12 సంవత్సరాల జీవితం కళ్ల ముందు కనిపిసిస్తుంది. "నిన్నుచూడాలని" చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎటు వెళుతున్నామో కూడా తెలియకుండా ఉండేది. అయితే "స్టూడెంట్ నెం1", "ఆది", "సింహాద్రి"...ఇలా సక్సెస్ వస్తుంటే బాగానే ఉంది అనిపించింది. చిన్న వయసు కదా, జీవితం అంతా ఇలాగే ఉంటుంది అనుకున్నాను. అర్ధం కాలేదు.
ప్రతి మనిషి క్రిందకి పడితేనే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు వేసి కిందకి పంపిస్తాడు. నేను లోపల కుమిలి పోయాను. మీరు నా మీద ప్రేమ చూపిస్తూ ఉన్నా కూడా, అభిమానులుగా మీరెంతో బాధపడ్డారు అన్న విషయం నాకు తెలుసు. అలా ఉన్నరోజుల్లో ఒకరోజు వక్కంతం వంశీ నాకో కధ చెప్పాడు. ఆ సినిమా పేరే టెంపర్. వంశీ కథ చెప్పినప్పుడు దూరంగా ఒక వెలుగు కనిపించింది. ఇది బాగుంటుందేమో అనిపిచింది. పూరి లాంటి దర్శకుడు, సత్వహాగా కథ, మాటలు రాసే కేపాసిటి ఉన్నా, వంశీ చెప్పిన కథతో సినిమా చేద్దాం అనడం, ఆ సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత "నాన్నకు ప్రేమతో". దూరం గా ఉన్న వెలుగు కొంచెం దగ్గరకు వచ్చినట్టు అనిపించింది...గెటప్ చూసి చాలా మంది భయపడ్డారు. అసలు ఈ గెటప్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా లేదా అని అనుకున్నారు. కానీ సినిమా అభిమానులు, ప్రేక్షకుల ఆశీర్వాదంతో పెద్ద సక్సెస్ కావడంతో, నా గమ్యం కొంచెం దగ్గరయ్యింది.
జనతా గ్యారేజ్ కథ విన్నప్పుడు అనిపించింది. దగ్గర అవుతున్న వెలుగు మాత్రం ఈ సినిమానే అని. మనం ఏదీ ప్లాన్ చేయలేం. నిజానికి రెండు సంవత్సరాల క్రితమే శివ గారు ఈ కథ చెప్పారు. ప్లాప్ సినిమాల్లో బిజీగా ఉండి శివ గారి కథ విన్నాను. అప్పుడు ఉన్న కమిట్మెంట్స్ వలన చేయలేకపోయా. పుష్కరం తర్వాత అద్భుతమైన చిత్రం శివతో చేయాలి అని రాసిపెట్టేసాడేమో ఆ దేవుడు. అందుకే శివతో సినిమా ఇప్పుడు కుదిరింది. రచయిత కలం అగిపోతే తర్వాత ఏ సినిమా చేయాలో అర్థం కాదు. అదే రాతను ఎంత తక్కువ చేసి చూపించాలో ఆ చూపు దర్శకుడికి ఉండాలి. చాలా తక్కువ మంది రచయితలకు రచనతో పాటు దర్శకుడి చూపు కూడా ఉంటుంది. అలాంటి అతి తక్కువ మంది దర్శకుల్లో నా కొరటాల శివ ఉన్నాడని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది.
తను ఒక కథే రాస్తాడు. దానికి ఒక కథానాయకుడిని ఎన్నుకుంటే అతనే చివరి వరకు కథానాయకుడు. అంత మనసు పెట్టి కథ రాసుకుంటాడు. చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే వరుస సక్సెస్‌లు ఇస్తారు. ఆ వరుసలో చూసుకంటే జనతాగ్యారేజ్ శివకు హ్యాట్రిక్ చిత్రమవుతుంది. అలాగే గొప్పనటుడు, అంతకంటే మించి గొప్ప మనిషి మోహన్ లాల్ గారి తో నటించే అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. గొప్పనటుడు కంటే గొప్ప మనిషితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దేవిశ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి పాట కోసం తనెంత తపన పడతాడో నాకు తెలుసు. మా నిర్మాతలను చూస్తే..అమర్ అక్బర్ ఆంటోని లు గుర్తొస్తారు. మంచి మనసున్న మనుషులు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేయాలనుకుంటున్నాను.
ఇక నేను మాట్లాడాల్సిన ముఖ్యమైన వ్యక్తి సినిమాటోగ్రాఫర్ తిరు గురించి. నాకు నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్ పి.సి.శ్రీరామ్. బాగా ఇష్టం అయినా చిత్రం క్షత్రియ పుత్రుడు. ఆ సినిమా లో ఆయన దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన తిరు నా సినిమాకి పని చేయటం చాలా ఆనందం గా ఉంది. అద్భుతంగా వర్కి చేసినందుకు ధ్యాంక్స్. ఇప్పుడు నిస్సందేహం గా ఈయనే నా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్.
అలాగే ఇక నేను అభిమానులకు రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. నాన్నకు ప్రేమతో రిలీజ్ తర్వాత నేను ఎక్కడో చూసాను. నా ఫోటోకు పాలతో అభిషేకం చేస్తున్నారు. నేను దేవుడిని కాదు. నేను మీ తమ్మున్నో, అన్నయ్యనో, స్నేహితుడినో. ఆ పాల ప్యాకెట్ ను ఓ అనాధ శరణాలయంలో ఇస్తే ఆనందిస్తాను. అలాగే నాన్నకు ప్రేమతో సినిమా టైమ్ లో రిలీజ్ రోజు మూగ జంతవును బలి ఇవ్వడం జరిగింది. అలా చేయడం కరెక్ట్ కాదు. అన్నదానం చేయండి అంతే కానీ మూగ జంతువులను బలి ఇవ్వద్దు. ఒక కడుపు నిండుతుంది. అలా చేయడం వల్ల మీకు పుణ్యం వస్తుంది. మీ వల్ల నాకూ పుణ్యం వస్తుంది. నేను చెప్పిన ఈరెండు పాటిస్తారని ఆశిస్తున్నాను,నమ్ముతున్నాను. అభిమానులకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాతో మోహన్ లాల్, సమంత,నిత్యామీనన్, సాయి
పుష్కరాల గురించి మాట్లాడుతూ :
12 సంవత్సరాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు పుష్కరాలు వచ్చాయ. ఈ సందర్భంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన భక్తులను మన ఆదరాభిమానాలతో గొప్పగా తిరిగి పంపాలి. తెలుగు తనం అంటే ఏమిటో. తెలుగు ఆప్యాయత అంటే ఏమిటో మనం వారికి చూపించాలి. ఈ విషయం లో మీరు అందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను.
కచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది : కొరటాల శివ
కొరటాల శివ మాట్లాడుతూ ``జనతా గ్యారేజ్ సినిమా నాకు చాలా స్పెషల్. తారక్ నా కంటే చిన్నవాడైనా తనని నేను అన్నయ్య అని పిలుస్తాను. తనతో నా రిలేషన్ షిప్ చాలా స్పెషల్. ఎందుకంటే రైటర్‌గా పెద్దగా ఎదగనప్పుడు బృందావనం రాశాను. పెద్దగా మాట్లాడేవాడిని కాను. ఇదే వేదికపై ఎన్టీఆర్‌గారు నన్ను పరిచయం చేశారు. అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ ఎనర్జీకి మ్యాచ్ చేసేలా రాయాలని ఎప్పుడూ అనుకుంటూ ఈ సినిమా కోసం పనిచేశాను. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ మెయిన్‌టెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్నప్పుడు మోహన్‌లాల్‌గారు సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనలాంటి వ్యక్తికి నేను యాక్షన్ చెప్పాను. అంతకు మించి, బెస్ట్ యాక్టర్స్ ఎన్టీఆర్, మోహన్‌లాల్ లను ఒక ఫ్రేమ్‌లో పెట్టి యాక్షన్ చెప్పాను. అది నాకు చాలు. చాలా సుడి ఉంది. సమంత, నిత్యామీనన్ వంటి హీరోయిన్స్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
నేను ఎప్పుడూ బెస్ట్ టీంను పెట్టుకుంటాను. సినిమాటోగ్రాఫర్‌గారు తిరుగారు అద్భుతమైన టెక్నిషియన్. ఆయనతో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. చాలా ఎగ్జయిట్‌మెంట్ ఇస్తూ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. ప్రతి సీన్‌కు ఎలాంటి మూడ్ ఉంటుందో దానికి తగ్గ వర్క్ ఇచ్చారు. రామజోగయ్యగారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. దేవిశ్రీప్రసాద్‌గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. స్పాంటేనియస్ మ్యూజిక్ డైరెక్టర్. సీన్ చెబుతున్నప్పుడే ఆయన ప్రణామం ట్యూన్ ఇచ్చారు.నేను డైరెక్టర్ అనడం కంటే దేవికి పెద్దఫ్యాన్ అనుకోవచ్చు. సాయికుమార్ వంటి గొప్ప నటుడుతో పనిచేశాను. మోహన్ లాల్, ఎన్టీఆర్, సాయికుమార్ నటిస్తుంటే అలా చూస్తుండిపోయేవాడిని. ఇంత గొప్ప నటులతో నేను సినిమా తీస్తున్నానా అనుకునేవాడిని. బెనర్జీ, బ్రహ్మాజీ, అజయ్ వంటి వారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నెమ్మదస్థులు, మంచివాళ్లు. సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టే ప్యాషన్ ఉన్న నిర్మాతలు. వారికి స్పెషల్ థాంక్స్. సెప్టెంబర్2న ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాం. కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది'' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ''కొరటాలగారితో చేస్తున్న మూడో సినిమా. కమర్షియల్ సినిమాకు వాల్యూస్ కలిపి ట్రెండ్‌ను మార్చేశారు. రామజోగయ్యశాస్త్రిగారు మంచి లిరిక్స్ అందించారు. ఎన్టీఆర్ ను నేను తలైవా అని పిలుస్తాను. నాకెప్పుడైనా మనసు బాగోలేకపోతే తనతోనే మాట్లాడుతాను నాకు అన్నీ వేళ్లలో అండగా నిలబడే మిత్రుడు. యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.
రైటర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ ఎన్టీఆర్, కొరటాల <wbr />శివ నా మనసుకు బాగా దగ్గరైన వ్యక్తులు. సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్ తో సత్తా ఉన్న రైటర్ , డైరెక్టర్ కొరటాల శివ చేసిన సినిమా జనతా గ్యారేజ్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్రణామం అనే సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత పాత రికార్డ్స్ అన్ని రిపేర్ అవుతుందని అనుకుంటున్నాను
అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ 1974లో లెజెండ్, మనందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ సినిమాలో డబ్బింగ్ చెప్పాను. ఆయన ఆశీర్వాంతో ఎంటర్ అయిన నేను తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించాను. బాలయ్యతో రౌడీ ఇన్ స్పెక్టర్, కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్టర్ శివ గారికి ఈ చిత్రం హ్యాట్రిక్ అవుతుంది. మోహన్ లాల్ గార్కి ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ చెప్పాను. ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పిరియన్స్. తెలుగు ఇండస్ట్రీలో జనతా గ్యారేజ్ గ్రేట్ మూవీ అవుతుంది
అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ''నేను షూటింగ్ టైంలో సాంగ్స్ విన్నాను. టైటిల్ సాంగ్, ప్రణామం సాంగ్ వినగానే షూర్ ష్యాట్ హిట్ అవుతుందనిపించింది. సింహాద్రి ఎలాంటి వేవ్ ఇచ్చిందో అలాంటి వేవ్‌తో ఈ సినిమా రాబోతుందనిపించింది. జనతాగ్యారేజ్ తన కెరీర్‌లో నెంబర్‌వన్ సినిమా అవుతుంది. ఈ సినిమాతో కొరటాల శివ హ్యాట్రిక్ కొట్టి మరో రేంజ్‌లో ఉంటాడు. నిర్మాతలు శ్రీమంతుడుతో బ్లాక్‌బస్టర్ కొట్టారు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడతారు. మరో సినిమాను వారు హ్యాట్రిక్ కోసం రెడీ చేసుకోవాలి'' అన్నారు.
ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ ''దర్శక నిర్మాతలకు అభినందనలు. తారక్ నా తమ్ముడు. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. అలాగే తారక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది'' అన్నారు.
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ ''ఎన్టీఆర్ లుక్ బావుంది. గ్యారంటీ మంచి చిత్రమవుతుంది'' అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ ''నటనలో చాయిస్ వదలకుండా యాక్ట్ చేసే నటుడు ఎన్టీఆర్. తనతో సినిమా చేసిన తర్వాత మా మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. దేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిశ్శబ్దం తప్ప వేరే ఏం లేదు. కొరటాల శివ కమర్షియల్ సినిమాకు అప్‌డేట్ వెర్షన్. నేను నెక్ట్స్ సినిమా చేయబోయే సినిమా నిర్మాతలు చేసిన సినిమా ఇది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ ''నేను సినిమాలు చేసేటప్పుడు ఎన్టీఆర్‌తో ఎప్పుడు సినిమా చేస్తున్నావని అడిగేవారు. ఈ సినిమాలో తనతో పనిచేసే అవకాశం కలిగింది. ఇంత పెద్ద స్టార్ హీరో తో చేయటం ఇదే మొదటి సారి. మంచి కంటెంట్ ఉండే కమర్షియల్ సినిమాల చేయాలని ఎప్పటి నుండో ఉండేది. కొరటాల శివగారు నా కోరికను తీర్చారు'' అన్నారు.
ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ ''అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు చాలా పెద్ద థాంక్స్. ఎన్టీఆర్‌తో కలసి ఈ సినిమాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అభిమానులు ఎంజాయ్ చేసే చిత్రమవుతుంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, అజయ్, రాజీవ్ కనకాల, కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ తిరు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తి