Karulo Shikarukelite ready for censor

సెన్సార్ కి సిద్దమైన 'కారులో షికారుకెళితే '

ఇంతకుముందు గులాబీ వంటి సామజిక స్పృహ ఉన్న చిత్రానికి దర్శకత్వం వహించిన మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన యూత్ ఫుల్ చిత్రం ''కారులో షికారుకెళితే ''. శ్రీ హరిహర ఫిలిమ్స్ బ్యానర్ పై ధీరు మహేష్ , కుమారి 21 f ఫేం సుదర్శన్ , సురేష్ ,ఇషికా సింగ్ ,ప్రియాంక ,జీవా , జబర్దస్త్ ఫణి , రాము ,ముఖ్య పాత్రల్లో నటించగా మధు ,అనీష్ , అభిరామ్ సంయుక్తంగా నిర్మించారు . షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కి సిద్దమైంది . త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని రిలీజ్ కి సిద్దమౌతున్న నేపథ్యంలో దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ '' యూత్ కి కావలసిన అన్ని అంశాలతో పాటు పూర్తీ స్థాయిలో వినోదాత్మకంగా రూపొందించిన చిత్రమే మా ''కారులో షికారుకెళితే ''. నిర్విరామంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేసుకుందని మరో పది రోజుల్లో సెన్సార్ కెలుతున్నామని , అలాగే ఫస్ట్ లుక్ , టీజర్ కార్యక్రమాలు స్వాతంత్య దినోత్సవ సందర్భంగా చేయాలనుకుంటున్నామని సెన్సార్ పూర్తయిన తర్వాత వచ్చే నెల లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు . నిర్మాతలు మధు ,అనీష్ , అభిరామ్ మాట్లాడుతూ '' యూత్ ఫుల్ చిత్రంగా తెరకెక్కిన మా కారులో షికారుకెళితే యూత్ ని అలరించేలా రూపొందిందని తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం'' వ్యక్తం చేసారు .

కెమెరా : చంద్రశేఖర్ వేమూరి .
సంగీతం : మీనాక్షి భుజంగ్
ఎడిటర్ : వి. ఆర్ . ఆనంద్
మాటలు : లక్కీ , ప్రదీప్ నామాని
నిర్మాతలు : మధు , అనీష్ , అభిరామ్
కథ ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం : మాదాల కోటేశ్వర్ రావు

Facebook Comments
Share

This website uses cookies.