సుశాంత్ 'ఆటాడుకుందాం.. రా' పాటలో అఖిల్ స్టెప్స్
సుశాంత్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ్ కార్పోరేషన్, శ్రీ జి ఫిలింస్ పతాకాలపై జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న 'ఆటాడుకుందాం.. రా'లో యువసామ్రాగ్ నాగచైతన్య స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అక్కినేని అఖిల్ 'ఆటాడుకుందాం.. రా' కోసం సుశాంత్‌తో కలిసి ఓ పాటలో స్టెప్‌లు వేశాడు. ఈ స్పెషల్ అప్పియరెన్స్ ఈ పాటకి పెద్ద ప్లస్ అవుతుంది. అఖిల్ చిన్నప్పుడు చేసిన 'సిసింద్రీ'లో కింగ్ నాగార్జునపై తీసిన 'ఆటాడుకుందాం.. రా' పాట చాలా పెద్ద హిట్ అయింది. ఆ పాట పల్లవినే టైటిల్‌గా పెట్టుకుని వస్తోన్న 'ఆటాడుకుందాం.. రా' సినిమాలో అఖిల్ డాన్స్ చేయడం అక్కినేని అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుంది.
ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ - ''సుశాంత్‌తో కలిసి 'ఆటాడుకుందాం.. రా' సాంగ్‌లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్యాన్స్‌కు ఈ సాంగ్ చాలా బాగా నచ్చుతుంది'' అన్నారు.
సుశాంత్ మాట్లాడుతూ - ''చైతన్య స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం, అఖిల్ ఈ సాంగ్‌లో డాన్స్ చేయడం నాకు చాలా ఆనందంగా వుంది. అభిమానులకు ఈ సినిమా అన్నివిధాలా సంతృప్తిని కలిగిస్తుంది'' అన్నారు.
నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''అఖిల్ ఈ పాటలో మెరుపులా మెరిసి అక్కినేని ఫ్యాన్స్‌ని ధ్రిల్ చేస్తాడు. చైతన్య స్పెషల్ అప్పియరెన్స్ అందర్నీ అలరిస్తుంది. ఆగస్టు 19న వరల్డ్‌వైడ్‌గా సినిమా రిలీజ్ చేస్తున్నాం. సుశాంత్ కెరీర్‌కు, మా శ్రీ జి ఫిలింస్ బ్యానర్‌కు 'ఆటాడుకుందాం.. రా' సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''సుశాంత్ హీరోగా చేసిన ఈ సినిమాలో అఖిల్ సాంగ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం నాకు చాలా ధ్రిల్‌గా ఉంది. అలాగే చైతన్య కూడా ఈ సినిమాలో ఓ సీన్‌లో చేయడం చాలా హ్యాపీ. నా కెరీర్‌లో 'ఆటాడుకుందాం.. రా' బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.
నిర్మాత ఎ.నాగసుశీల మాట్లాడుతూ - ''అక్కినేని అభిమానులకు 'ఆటాడుకుందాం.. రా' పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. సుశాంత్, చైతన్య, అఖిల్ ముగ్గుర్నీ ఈ సినిమాలో అభిమానులు చూసి ఆనందిస్తారు'' అన్నారు.
డాన్స్ మాస్టర్ శేఖర్ మాట్లాడుతూ - ''సుశాంత్, అఖిల్ కాంబినేషన్‌లో డాన్స్ మూమెంట్స్ చేయించే అవకాశం రావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సాంగ్ సూపర్‌హిట్ అవుతుంది'' అన్నారు.
సుశాంత్, సోనమ్ ప్రీత్ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: వెంకట్,రామ్ సుంకర, ఛీఫ్ కో-డైరెక్టర్. డి.సాయికృష్ణ, కో-డైరెక్టర్: కొండా ఉప్పల, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.