Social News XYZ     

Director YVS Chowdary express condolences for Jyothi Lakshmi death

నాట్య తార జ్యోతి లక్ష్మి మృతి పట్ల సంతాపం ప్రకటించిన  దర్శకుడు, నిర్మాత వై వి ఎస్ చౌదరి.

Director YVS Chowdary express condolences for Jyothi Lakshmi death

'పుట్టినవారు గిట్టక తప్పదు అనేది నగ్న సత్యం'.. కానీ, ఈ జీవనప్రయాణంలో మనం ఎంతమంది అభిమానాన్ని పొందామన్నదే జీవితపరమార్ధం..

తాను ఇష్టపడ్డ రంగంలో రాణించడానికి కష్టపడి నేర్చుకున్న విద్యతోపాటు, దేవుడిచ్చిన అందమైన రూపంతో సినిమారంగంలో ప్రత్యేకస్ధానం సంపాదించుకున్న నటి "జ్యోతిలక్ష్మి గారు"..

 

తనకున్న ఒక్క రూపురేఖలతోనే కాకుండా, తన నాట్యచాతుర్యంతో, శరీరంలోని ప్రతిభాగాన్ని మెరుపులాంటి కదలికలతో తన ఆహార్యాన్ని ప్రదర్శించి, ప్రేక్షక హృదయసామ్రాజ్యాల్ని ఏలిన మొట్టమొదటి నాట్యతార  "జ్యోతిలక్ష్మిగారు"..

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, చలనచిత్రసీమల్లో "ప్రత్యేక గీతాలు" విభాగంలో తొట్టతొలి సూపర్‌స్టార్‌గా నెంబర్‌వన్ స్థానాన్ని సంపాదించుకున్న "జ్యోతిలక్ష్మిగారు", సౌత్ ఇండియాలోనే కాకుండా హిందీ చిత్రాలలో కూడా ఒక మెరుపు మెరిశారు..

నేను 'ఇలియానా'ను ఆడిషన్ చేసినపుడు, 'ఇలియానా'లోని లోయర్‌బాడీ అంటే నడుము నుంచి పాదాలవరకూ తొలినాటి "జ్యోతిలక్ష్మిగారి"తో రిసంబుల్స్, అలాగే ముఖకవళికల్లో తొలినాటి "జయప్రదగారి" రిసంబుల్సూ ఫీలయ్యి "దేవదాసు" సినిమా ద్వారా పరిచయం చేశాను. అలాగే "రేయ్" సినిమాలో 'శ్రద్ధాదాస్'ని "జ్యోతిలక్ష్మిగారి" ఫేస్ రిసంబుల్స్ ఫీలయ్యే పెట్టుకున్నాను..

"జ్యోతిలక్ష్మిగారి" పాపులర్ సాంగ్ 'మాయదారి చిన్నోడు' అనే పాటను కూడా ఆమె మీద మరియూ ఎల్. ఆర్. ఈశ్వరిగార్ల మీద అభిమానంతో  రీమిక్స్  చేసి  'దేవదాసు' చిత్రంలో పెట్టాను..

ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న "జ్యోతిలక్ష్మిగారు" నాలాంటి వారినే  కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్నా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ మరియూ హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అదీ ఆమె సంపాదించుకున్న ఆస్థి. అలాంటి ఆమె ఈరోజు మన లోకాన్ని విడిచి పరలోకాలకు వెళ్ళిపోయింది అన్న వార్త నన్ను ఎంతో కలచి వేసింది..

తన నాట్యకౌశల్యంతో ఇప్పటివరకూ భూలోకంలో సంపాదించిన అభిమానంతోపాటు, ఇకనుంచీ స్వర్గలోకంలో కూడా అమరుల అభిమానాన్ని కూడాగట్టుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢసంతాపం తెలియజేస్తున్నాను..

మీ
వై వి ఎస్ చౌదరి.

 

Facebook Comments