“అత్తారిల్లు” ఆల్ ఏరియా రైట్స్ సొంతం చేసుకున్న శ్రీలక్ష్మి పిక్చర్స్ బాపిరాజు
అంజన్ కళ్యాన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంలో మెలోడీబ్రహ్మ మణిశర్మ నేపధ్యసంగీతంలో అంజన్ కే కళ్యాణ్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన “ అత్తారిల్లు ” చిత్రానికి సంబందించిన ఆల్ ఏరియా రైట్స్ ను శ్రీలక్ష్మిపిక్చర్స్ అదినేత బాపిరాజు సొంతం చేసుకున్నారు.. ఈ సందర్భంగా బాపిరాజు సంతోషం వ్యక్తం చేస్తూ శ్యాం ప్రసాద్ రెడ్డి , కృష్ణ వంశీ , రాంగోపాల్ వర్మ లాంటి మహామహుల వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అంజన్ కే కళ్యాణ్ తెరకెక్కించిన అత్తారిల్లు నాకు బాగా నచ్చి తీసుకోవడం జరిగింది.. చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తాయని మరోమారు రుజువు చెయ్యబోయే సినిమా ఇది.. మణిశర్మ గారు అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కడుపుబ్బా నవ్వించే కామెడీ, భయపెట్టించే ధ్రిల్స్ ,వినసొంపైన రెండు మంచి పాటలతో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ఇటీవల విడుదలయిన టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.