Social News XYZ     

Aatadukundam Raa movie audio released by Akhil

అక్కినేని అఖిల్ చేతుల మీదుగా `ఆటాడుకుందాం..రా` ఆడియో విడుదల

Aatadukundam Raa movie audio released by Akhil

కాళిదాసు, కరెంట్‌, అడ్డా... చిత్రాలతో ప్రేక్ష‌కాభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌.  స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా (జస్ట్‌ చిల్‌). అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనాగ్ కార్పోరేష‌న్, శ్రీజి ఫిలింస్ బ్యాన‌ర్స్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు,ఎ.నాగ సుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ మ్యూజిక్ అందించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఆటాడుకుందాం...రా ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖులు,అభిమానుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ శిల్ప క‌ళావేదిక‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అక్కినేని అఖిల్ ముఖ్య అతిధిగా హాజ‌రై ఆటాడుకుందాం...రా ఆడియోను ఆవిష్క‌రించగా...ఆటాడుకుందాం...రా  ట్రైల‌ర్ ను హీరో సుమంత్ రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా

మా ధైర్యం, బలం అభిమానులే

 

హీరో  అఖిల్ మాట్లాడుతూ...మా ఫ్యామిలీ లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యుంటే అది అనూప్. చైత‌న్య‌కి నాకు ఒక  బ్ర‌ద‌ర్ లా వ‌ర్క్ చేస్తాడు. నాన్న‌కు త‌మ్ముడులా వ‌ర్క్ చేస్తాడు. మాకు మ‌నం ఇచ్చాడు అది ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేం. సుశీల మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రికీ ఫేవ‌రేట్. సో..సుశీల‌మ్మ‌కి మా అంద‌రి స‌పోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇక‌ సుశాంత్ గురించి చెప్పాలంటే...సినిమాల త‌ప్ప వేరే ధ్యాసే ఉండ‌దు. ఆల్ ది బెస్ట్ సుశాంత్. నాన్న గారు ఈ ఫంక్ష‌న్ కి రావాలి అనుకున్నారు కానీ...అమితాబ్ గారితో ముంబాయిలో యాడ్ షూటింగ్ ఉండ‌డం వ‌ల‌న రాలేదు. ఈ షంక్ష‌న్ కి రాలేక‌పోయినందుకు సారీ చెప్ప‌మ‌న్నారు. మా ధైర్యం, బ‌లం అభిమానులే. ఇక నుంచి మ‌న సినిమాలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. అభిమానులంద‌ర్నీ చూసిన త‌ర్వాత ఎన‌ర్జి వ‌చ్చింది. ఇక నేను చెల‌రేగిపోతాను అన్నారు.

సుశాంత్ డేడికేషన్ నాకు బాగా నచ్చుతుంది

 

హీరో సుమంత్ మాట్లాడుతూ...సుశాంత్ డెడికేష‌న్ ని మెచ్చుకోవాలి, నాకు బాగా నచ్చతుంది. డ్యాన్స్, ఫైట్స్ లో సుశాంత్ హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది. నాగేశ్వ‌రెడ్డి తెర‌కెక్కించిన ఈడోర‌కం ఆడోర‌కం చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేసాను. నా సినిమా రెడీగా ఉంది. సెప్టెంబ‌ర్ లో కానీ.. అక్టోబ‌ర్ లో కానీ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను. అలాగే చైత‌న్య రెండు సినిమాలు, చిన మావ‌య్య సినిమా కూడా రెడీ అవుతుంది అన్నారు.

అక్కినేని ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటారో అలా కనపడతాను

 

హీరో సుశాంత్ మాట్లాడుతూ...చిన మావ‌య్య హిట్ కొడుతున్నాం అని చెప్పి మరీ సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో హిట్ కొట్టారు. చిన మావ‌య్య చెప్పిన‌ట్టుగా నేను చెప్ప‌లేను కానీ..ఈ సినిమా ఖ‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది. ఈ సినిమాకి అమ్మ చాలా క‌ష్ట‌ప‌డింది.  అమ్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.  శ్రీనివాస్ అంకుల్  ఫ‌స్ట్ సినిమా నుంచి స‌పోర్ట్ చేస్తున్నారు. సినిమాని బాగా ప్ర‌మోట్ చేస్తారు. ప్ర‌తి సినిమాకి బాగా క‌ష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న‌ క‌ష్టం, న‌మ్మ‌కంకు త‌గ్గ‌ట్టు గుర్తింపు రావాలి అని కోరుకుంటున్నాను. బ్ర‌హ్మానందం గారు నువ్వు హిట్ కొట్టాలి అని చెప్పి న‌న్ను  స‌పోర్ట్ చేస్తూ ఈ సినిమా చేసారు. ఇక ఈ మూవీకి అనూప్ చాలా మంచి ట్యూన్స్ అందించాడు. అలాగే  టైమ్ మిష‌న్ సెట్ చాలా బాగా వేసారు. ఆడియోన్స్ ను బాగా ఆక‌ట్టుకుంటుంది. శ్రీధ‌ర్ సీపాన క‌థ చెప్పిన‌ప్పుడు ఫ‌స్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేసాను. అంత బాగా న‌చ్చింది. ఈ క‌థ‌ను డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి గారు మ‌రో లెవ‌ల్ కి తీసుకువెళ్లారు. ఫ్యాన్స్  న‌న్ను ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూపించారు. మీరు గ‌ర్వ‌ప‌డేలా ఉండ‌డానికి ట్రై చేసాను. మ‌న‌సుకి న‌చ్చిన సినిమాలు చేయాల‌నుకుంటాను అందుచేత సినిమా సినిమాకి ఆల‌స్యం అవుతుంది. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య స్పెష‌ల్ అప్పీరెన్స్ ఉంటుంది. నేను అడిగిన వెంట‌నే ఓకే అని చెప్పి చేసిన చైత‌న్య‌కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అలాగే అఖిల్ కూడా ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నాడు. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

అన్న‌పూర్ణ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా

 

డైరెక్ట‌ర్ జి.నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ... సుశాంత్ తో నాలుగేళ్ల క్రిత‌మే సినిమా చేయాలి కానీ... మిస్ అయ్యింది. ఆత‌ర్వాత నుంచి చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు గారు  నాతో ట‌చ్ లోనే ఉండి సినిమా చేద్దాం అన్నారు. లేట్ అయినా సుశాంత్ తో మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. తెలుగు ఇండ‌స్ట్రీకి పునాది అయిన‌ అన్న‌పూర్ణ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన చిత్రానికి వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. అన్న‌పూర్ణ సంస్థ‌లో వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ఇది టెక్నీషియ‌న్స్ సినిమా. అనూప్ ఎక్స్ ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించాడు. కెమెరామెన్ శివ‌ బాగా కోప‌రేట్ చేయ‌డంతో సినిమా బాగా రిచ్ గా వ‌చ్చింది. నారాయ‌ణ రెడ్డి అద్భుత‌మైన టైమ్ మిష‌న్ సెట్ ఇచ్చారు.  నేను ఈ సినిమాని ఇంత బాగా తీయ‌డానికి ఎన‌ర్జి సుశాంత్. ఈ సినిమా ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంది అన్నారు.

ఈసారి డెఫినెట్ గా హిట్ కొడుతున్నాం

 

నిర్మాత నాగ సుశీల మాట్లాడుతూ...సాంగ్స్ చూసాను. ఈసారి డెఫినెట్ గా హిట్ కొడుతున్నాం. అనూప్ మా ఫ్యామిలీ మెంబ‌ర్. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం గారు చాలా మంచి క్యారెక్ట‌ర్ చేసారు. నేను ఫోన్ చేసి అడిగిన వెంట‌నే ఇంకేమి మాట్లాడ‌కుండా చేస్తాను అన్నారు ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మానందం గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ చిత్రాన్ని అంద‌రూ చూసి ఆద‌రించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

మంచి టీమ్ తో రూపొందించిన చిత్రం ఆటాడుకుందాం...రా 

నిర్మాత చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ... గౌత‌మ్ రాజు ఎడిటింగ్,  శ్రీధ‌ర్ సీపాన స్టోరీ, అనూప్ మ్యూజిక్,  నాగేశ్వ‌రెడ్డి డైరెక్ష‌న్...ఇలా   మంచి టీమ్ తో రూపొందించిన ఆటాడుకుందాం...రా మీ ముందుకు వ‌స్తుంది. ఫ‌స్ట్ కాపీ రెడీ గా ఉంది. స్వాతంత్ర్య దినోత్స‌వ కానుక‌గా ఆటాడుకుందాం..రా చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

 

 

డైరెక్ట‌ర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ... సుశాంత్ ప్ర‌తి సినిమాకి నెక్ట్స్ లెవెల్ కి వెళుతుంటారు. కాళిదాసు కంటే బెట‌ర్ క‌రెంట్, క‌రెంట్ కంటే బెట‌ర్ అడ్డా, ఇప్పుడు అడ్డా కంటే ఆటాడుకుందాం..రా బెట‌ర్ మూవీ అవుతుంది. అడ్డా టైమ్ లో సుశాంత్ మంచి ఫ్రెండ్ అయ్యారు. సుశాంత్ డెడికేష‌న్ తో వ‌ర్క్ చేస్తుంటారు. అయితే..సుశాంత్ లో న‌చ్చ‌ని విష‌యం ఏమిటంటే... మూడు సంవ‌త్స‌రాల‌కు ఒక‌ సినిమా చేయ‌డం. ఇక నుంచి సుశాంత్ సంవ‌త్స‌రానికి రెండు సినిమాలు చేయాలి అని కోరుతున్నాను. ఇక నిర్మాత చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు గారు గురించి చెప్పాలంటే... టేస్ట్ తో పాటు గ‌ట్స్ ఉన్న ప్రొడ్యూస‌ర్ ఆయ‌న‌. వ‌రుస‌గా ముగ్గురు ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేసారు. మ‌న ఇండ‌స్ట్రీకి ఇలాంటి నిర్మాత ఉండ‌డం అదృష్టం.  సినిమా అన్ని ఏరియాల‌కు రీచ్ అయ్యేలా బాగా ప్ర‌మోష‌న్స్ చేస్తారు. ఇలాంటి నిర్మాత ఎప్పుడూ స‌క్సెస్ అవ్వాలి. ఇప్పుడు డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి టైమ్ న‌డుస్తుంది. క‌నుక ఈ సినిమా ఖ‌చ్చితంగా సెన్సేష‌న‌ల్ హిట్ అవుతుంది. అనూప్ మ్యూజిక్ యూత్ ని బాగా ఆక‌ట్టుకుంది. అనూప్ మ్యూజిక్ అందించిన ఈ ఆడియో కూడా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ సూర్య‌ప్ర‌తాప్ మాట్లాడుతూ...  క‌రెంట్ సినిమాకి అవ‌కాశం ఇచ్చి న‌న్ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసిన నిర్మాత చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు గార్కి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు గారు కొత్త‌గా శ్రీజ‌ బ్యాన‌ర్ పెట్టారని తెలిసింది. నాకు అవ‌కాశం ఇస్తే శ్రీజ బ్యాన‌ర్ లో సినిమా చేయ‌డానికి నేను రెడీగా ఉన్నాను. సుశాంత్ న్యూలుక్ లో చాలా బాగున్నారు. అనూప్ అందించిన సాంగ్స్ సూప‌ర్ గా ఉన్నాయి. టీజ‌ర్ చూస్తుంటే సినిమా ఎప్పుడూ చూస్తామా అనిపిస్తుంది. ఆటాడుకుందాం..రా  టీమ్ కి ఆల్ ది బెస్ట్ అని తెలియ‌చేసారు.

బ్ర‌హ్మానందం మాట్లాడుతూ...సుశాంత్ చాలా టాలెంటెడ్ హీరో. ఈ సినిమాలో సుశాంత్ న‌టించిన‌ తీరు చాలా బాగుంది. నేను ఈ సినిమాలో చాలా పెద్ద క్యారెక్ట్ చేసాను. యంగ్ డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి గురించి చెప్పాలంటే....అత‌ను ప్రొడ్యూస‌ర్స్ డైరెక్ట‌ర్. మా క‌మెడియ‌న్స్ అంద‌రికీ మంచి క్యారెక్ట‌ర్స్ ఇచ్చి ప్రొత్స‌హిస్తుంటాడు. ఇక నాగేశ్వ‌రెడ్డికి  కామెడీ సీన్స్ బాగా రాసే రైట‌ర్ శ్రీధ‌ర్ సీపాన క‌లిస్తే ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇందులో వ‌ప‌ర్ ఫుల్ ప్యాక్ట్ కామెడీ ఉంది. నా త‌మ్ముడు ర‌ఘుబాబు, పృధ్వీ, వెన్నెల కిషోర్...ఇలా క‌మెడియ‌న్స్ అంద‌రూ న‌టించిన ఈ సినిమాని చూస్తున్నంత సేపు ఆడియోన్స్ న‌వ్వుతూనే ఉంటారు అన్నారు.

డైరెక్ట‌ర్  క‌ళ్యాణ్ కృష్ణ‌ మాట్లాడుతూ....నేను డైరెక్ట‌ర్ అవ్వ‌డానికి కార‌ణం నాగార్జున గారి  ధైర్యం. ఆయ‌న ధైర్యం చేయ‌డం వ‌ల‌నే నాలాంటి చాలా మంది ద‌ర్శ‌కులుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అయ్యారు. నాకు లైఫ్ లాంగ్ ఎదురుగా క‌నిపించే రియ‌ల్ హీరో అంటే నాగార్జున గారే. అక్కినేని గారి ఆశీస్సులు వ‌ల‌నే స‌క్సెస్ అయ్యాను అని ఫీల‌వుతుంటాను. నాపైనే అక్కినేని గారి ఆశీస్సులు ఉంటే...ఇక‌ సుశాంత్ పై ఖ‌చ్చితంగా ఉంటాయి.  నాగ సుశీల గారు హ్యాండ్ ల‌క్కీ హ్యాండ్. నాగ సుశీల గారి ల‌క్కీ హ్యాండ్  నిర్మాణంలో వ‌స్తున్న ఈ సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంది.  సోగ్గాడు చిన్ని నాయ‌నా స‌క్సెస్ లో అనూప్ పాత్ర చాలా ఉంది. అలాగే నాగార్జున గారి పంచెక‌ట్టు కూడా మేజ‌ర్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో సుశాంత్ పంచెక‌ట్టు చాలా బాగుంది. చైత‌న్య‌, అఖిల్ కూడా త్వ‌ర‌లో పంచెక‌ట్టులో క‌నిపిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత‌ మల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ...ఈ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. సుశాంత్ సంవ‌త్స‌రానికి ఖ‌చ్చితంగా రెండు సినిమాలు చేయాలి. సుశాంత్ తో మా సంస్థ‌లో సినిమా చేయ‌డానికి నేను రెడీగా ఉన్నాను. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాలి అన్నారు.

సూపర్ హిట్ ప్రతికాధినేత  బి.ఎ.రాజు మాట్లాడుతూ...అఖిల్ ప‌స్ట్ ఫిల్మ్ లోని ఆటాడుకుందాం రా అనే సాంగ్ టైటిల్ తో సుశాంత్ సినిమా చేయ‌డం, ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్ కి అఖిల్ రావ‌డం హ్యాపీగా ఉంది. ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఉండే సినిమా ఇది.  దేవ‌దాసు చిత్రంలోని అక్కినేని గారి ప‌ల్లెకు పోదాం సాంగ్ రీమిక్స్ చేసారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్, జెమిని కిర‌ణ్‌, పృధ్వీ, శ్రీధ‌ర్ సీపాన‌, డైమండ్ ర‌త్నం త‌దిత‌రులు పాల్గొన్నారు.

సుశాంత్‌, సోనమ్‌ ప్రీత్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాసి, సుధ, ఆనంద్‌, రమాప్రభ, రజిత, హరీష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: వెంకట్‌,రామ్‌ సుంకర, ఛీఫ్‌ కో-డైరెక్టర్‌. డి.సాయికృష్ణ, కో-డైరెక్టర్‌: కొండా ఉప్పల, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రవికుమార్‌ యండమూరి, కథ-మాటలు: శ్రీధర్‌ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

Facebook Comments