సాధారణంగా సినీరంగంలో అనుబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయని అంటుంటారు. ఒకరిపట్ల మరొకరు చూపించే అభిమానం, ఆప్యాయతలన్నీ పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయని.. దర్శకనిర్మాతల విషయంలో ప్రేమాభిమానాలు సినిమా చేస్తున్నంతవరకే కొనసాగుతాయని...ఆ తర్వాత ఎవరి దారి వారిదని.. చెబుతుంటారు. అయితే ఈ విషయంలో కొంత మంది మినహాయింపుగా కనిపిస్తారు.
ఆ కోవలోకి చెందిన వారే దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌లు. వీరి స్నేహబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతకు ముందు సుకుమార్ దర్శకత్వంలో ఆర్య-2 చిత్రాన్ని తెరకెక్కించిన బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో ఇటీవలే నాన్నకు ప్రేమతో చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
ఇక నాన్నకు ప్రేమతో చిత్రం సాధించిన విజయం గురించి... ఆ సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందన తెలిసిందే. సో..ఈ అపురూప విజయాన్ని తన సంస్థకు అందించిన దర్శకుడు సుకుమార్‌కు ప్రేమతో బి.విఎస్.ఎన్ ప్రసాద్ ఓ విలువైన కానుకను అందజేశారు. శుక్రవారం సుకుమార్‌కు బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌త్రీ సీరిస్ కారును బహుమానంగా ఇచ్చారు బీవీఎస్‌ఎన్ ప్రసాద్. ఇలా సుకుమార్ పట్ల తనకున్న ప్రేమను ఈ రీతిలో చాటుకున్నారు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
This website uses cookies.