ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ ముఖ్య తారాగణంగా.. హాస్యానికి పెద్ద పీట వేస్తూ.. "ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితం" అనిపించేలా తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ "బంతిపూల జానకి". ఈ చిత్రాన్ని ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొద్యూసర్ తేజ. ఈ చిత్రం పాటలు "మ్యాంగో మ్యూజిక్" ద్వారా.. శిల్పకళా వేదికపై ఏర్పాటు చేసిన వేడుకలో భారీ సందడి నడుమ విడుదలయ్యాయి.
బోలె ఈ చిత్రానికి సంగీతం సారధ్యం వహింహగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన హీరో రామ్ ఆడియోను ఆవిష్కరించారు. క్రేజీ హీరోయిన్ రెజీనాతో పాటు.. శివారెడ్డి, సంపూర్ణేష్ బాబు, తనీష్, సిద్దు, పూరి ఆకాష్, అభిరామ్ దగ్గుబాటి, నందిని రెడ్డి, సాయిరాజేష్ నీలం, తుమ్మలపల్లి రామసత్యనారాయణ మరియు "పెళ్ళిచూపులు" టీమ్ ఈ ఆడియో వేడుకలో పాల్గొన్నారు. యాంకర్స్ జంట "రవి-లాస్య" వాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు.. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబు చెప్పిన డైలాగ్స్, వేసిన స్టెప్స్ ఆహుతులను ఉర్రూతలూగించాయి. "సంతోషం ఈవెంట్స్" ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మా మ్యూజిక్, టీవీ 9, ఎన్టీవీలలో ప్రత్యక్ష ప్రసారమయ్యింది. ధన్ రాజ్ నటించిన "బంతిపూల జానకి" భారీ విజయం సాధించాలని హీరో రామ్, హీరోయిన్ రెజీనాలతోపాటు అతిథులంతా ఆకాంక్షించారు. పాటలు చాలా బాగున్నాయంటూ ప్రత్యేకంగా ప్రశంసించారు.
సినిమా చాలా చాలా బాగా వచ్చిందని, అందుకే ఖర్చుకు వెరవకుండా ఆడియో ఫంక్షన్ ను ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేశామని నిర్మాతలు కల్యాణి-రామ్ పేర్కొన్నారు. "కెరీర్ బిగినింగ్ లో ఆటుపోట్లు, ఆర్ధిక బాధలు ఎదుర్కొంటున్నప్పుడు తనను ఆదుకున్న హీరో రామ్.. తన ఆహ్వానాన్ని మన్నించి "బంతిపూల జానకి" ఆడియోకు ముఖ్య అతిధిగా రావడం చాలా ఆనందంగా ఉందని" ధనరాజ్ పేర్కొన్నారు. "టీమ్ మెంబర్స్ అందరూ సహకరించడం వల్ల సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని, ఎడిటర్ శివ, డిజైనర్ వివా తదితరులు ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారని" దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ అన్నారు. దర్సకుడిగా తనకు మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శక నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహంతో "బంతిపూల జానకి" చిత్రానికి చాలా మంచి సంగీతం అమరిందని సంగీత దర్శకుడు బోలె అన్నారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు రాసే అవకాశం ఇఛ్చిన దర్శక నిర్మాతలకు కాసర్ల శ్యామ్ కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: డా. శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజ, నిర్మాతలు: కళ్యాణి-రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!
This website uses cookies.