Social News XYZ     

Rani Gari Bunglow audio success meet held at Hyderabad Prasad Labs

`రాణిగారి బంగ‌ళా` ఆడియో సక్సెస్ మీట్

Rani Gari Bunglow audio success meet held at Hyderabad Prasad Labs

బాలాజీ నాగ‌లింగం స‌మ‌ర్ప‌ణ‌లో ఆనంద్ నందా, ర‌ష్మి గౌత‌మ్, శివ‌కృష్ణ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం రాణిగారి బంగ‌ళా. వి సినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై డి.దివాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కింది. ఈశ్వ‌ర్ పేర‌వ‌ల్లి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో స‌క్సెస్ మీట్ కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా నటుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి మాట్లాడుతూ..సినిమా టైటిల్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. సినిమా యాబై రోజులు ఆడే చిత్రంగా క‌న‌ప‌డుతుంది. ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించి నిర్మాత బాలాజీ నాగ‌లింగం గారికి పూర్వ వైభ‌వాన్ని తీసుకొస్తుంద‌ని భావిస్తున్నాను. ఆడియో స‌క్సెస్ అయిన విధంగానే సినిమాను పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్...తెలిపారు.

 

నటుడు శివ‌కృష్ణ మాట్లాడుతూ..నిర్మాత గ‌తంలో కొన్ని సినిమాలు చేసి స‌క్సెస్ అయ్యార‌ని కొంత మంది తెలియ‌జేశారు. అలాగే ద‌ర్శ‌కుడు దివాక‌ర్ సినిమాను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో కాటి కాప‌రి పాత్ర‌ను వేశాను. మంచి టీంతో కలిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా పెద్ద స‌క్సెస్‌ను సాధించి యూనిట్‌కు మంచి పేరు తీసుకువ‌స్తుంద‌ని భావిస్తున్నాను..అన్నారు.

తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ..ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో మంచి ప‌రిచ‌యం ఉంది. ఈ సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించార‌ని తెలుస్తుంది. సినిమాలో పాటలు పెద్ద విజయాన్ని సాధించిన‌ట్లు సినిమా కూడా పెద్ద విజ‌యాన్ని సాధించాలి.. అన్నారు.

ద‌ర్శ‌కుడు డి.దివాక‌ర్ మాట్లాడుతూ..ఈశ్వ‌ర్ అందించిన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న రావ‌డం సంతోషంగా ఉంది. మంచి హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం. ఈశ్వర్ మంచి సంగీతాన్నదించాడు. నిర్మాతల సహకారంతో మంచి సినిమాను చేయగలిగాను. హీరో ఆనంద్ చక్కగా యాక్ట్ చేశాడు. ఫ్యూచర్ లో మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడు. సినిమాను జూలై 29న రెండు వందల థియేటర్స్ లో విడుదల చేయాలనుకుంటున్నాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్...అన్నారు.
బాలాజీ నాగ‌లింగం మాట్లాడుతూ...చిన్న నిర్మాతనైనా నాకు సినిమాయే లోకం. ఎన్నో క‌ష్ట‌నష్టాల‌కోర్చి ఈ సినిమాను చేశాను. ద‌ర్శ‌కుడు డి.దివాక‌ర్ సినిమాని చాలా బాగా తీశాడు. ఈ సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరుతో పాటు, మున్ముందు మంచి అవకాశాలు కూడా వస్తాయని, రావాలని కోరుకుంటున్నాను. ఈశ్వ‌ర్ పేర‌వ‌ల్లి అందించిన సంగీతం ఈ మూవీకే హైలైట్. అంద‌రూ మ‌రింత స‌హ‌కారాన్ని అందించి సినిమాను పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాను..అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, సంతోషం సురేష్ త‌దితరులు పాల్గొన్నారు.

Facebook Comments