TV Artist Association threatens a new agitation on dubbing serials

డ‌బ్బింగ్ సీరియ‌ల్స్ పై మ‌ళ్లీ ఉద్య‌మం

డ‌బ్బింగ్ సీరియ‌ల్స్‌పై తెలుగు టెలివిజ‌న్ యూనియ‌న్ సీరియ‌స్ అయింది. తెలుగు ఆర్టిస్టుల‌కు, టెక్నీషియ‌న్ల జీవితాల‌ను రోడ్డున ప‌డేసేలా డబ్బింగ్ సీరియ‌ల్స్ దండ‌యాత్ర చేస్తున్నాయ‌ని తెలుగు టెలివిజ‌న్ యూనియ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. డ‌బ్బింగ్ సీరియ‌ల్స్ అడ్డుకుని తీరుతామ‌ని మ‌రోసారి ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యామ‌ని తెలుగు టెలివిజ‌న్ ఆసోషియేష‌న్ ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు ఫిలించాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్టు యూనియ‌న్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బుల్లితెర ఆర్టిస్టుల డైరెక్ట‌రీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆర్టిస్టుల డైరెక్ట‌రీ ఆవిష్క‌రించారు. టెలివిజ‌న్ యూనియ‌న్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు తన‌వంతు కృషి చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ అన్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, సుఖీభ‌వ వెంచ‌ర్ అధినేత గురురాజ్‌ను, టీవీ ఫెడ‌రేష‌న్ చైర్మెన్ మేచినేని శ్రీ‌నివాస‌రావును స‌న్మానించారు. తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్టు అధ్య‌క్షుడు వినోద్‌బాల‌, తెలుగు టెలివిజ‌న్ ఆర్టిస్టు అసోషియేష‌న్ సెక్ర‌ట‌రీ విజ‌య్ యాద‌వ్, న‌టుడు శివాజీ రాజా, హ‌రి, రామ్‌జ‌గ‌న్‌, నాగ‌మ‌ణి, సుబ్బారావు.. టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%