వైభవంగా ప్రారంభమైన వి.కె.ఎ. ఫిలింస్ 'ఆకతాయి'
నూతన నటుడు ఆశిష్ రాజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రుక్సర్ మీర్ హీరోయిన్‌గా వి.కె.ఎ. ఫిలింస్ పతాకంపై నవ దర్శకుడు రాం భీమన దర్శకత్వంలో నూతన నిర్మాతలు కె.ఆర్. విజయ్ కరణ్, కె.ఆర్.కౌషల్ కరణ్, కె.ఆర్. అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఆకతాయి'. ఈ చిత్రం జూలై 22న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఆత్మీయ అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రతాప్ ఆర్ట్స్ అధినేత, సీనియర్ ప్రొడ్యూసర్ రాఘవ ముఖ్య అతిథిగా హాజరవగా, ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో ఆశిష్ రాజ్, హీరోయిన్ రుక్సన్ మీర్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ఆర్.కె. గౌడ్ క్లాప్‌నివ్వగా, చిత్ర నిర్మాతలు విజయ్, కౌషల్, అనిల్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సన్నివేశానికి రాఘవ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో ఆశిష్ రాజ్, హీరోయిన్ రుక్సర్ మీర్, దర్శకుడు రాం భీమన, కెమెరామెన్ వెంకట్ గంగధారి, నిర్మాలు కె.ఆర్. విజయ్ కరణ్, కె.ఆర్. కౌషల్ కరణ్, కె.ఆర్. అనిల్ కరణ్ పాల్గొన్నారు.
నిర్మాతల్లో ఒకరైన కె.ఆర్. కౌషల్ కరణ్ మాట్లాడుతూ - ''రియల్ ఎస్టేట్స్, కన్‌స్ట్రక్షన్స్ రంగంలో వున్న మేము వి.కె.ఎ. ఫిలింస్ బ్యానర్‌ని స్టార్ట్ చేసి మంచి సినిమాలు తియ్యాలని నిర్ణయించుకున్నాం. రాం భీమన చెప్పిన స్టోరీ నచ్చి ఎంతో ఇన్‌స్పైర్ అయి మొదటి ప్రాజెక్ట్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. మంచి ఆర్టిస్ట్‌లు, ప్రతిభగల టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం'' అన్నారు.
దర్శకుడు రాం భీమన మాట్లాడుతూ - ''నేను లండన్‌లో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో డి.ఎఫ్.టి. చేశాను. ఆ తర్వాత కొన్ని ఇంగ్లీష్ మూవీస్‌కి వర్క్ చేశాను. అక్కడే కొన్ని షార్ట్ ఫిలింస్ తీయడం జరిగింది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. తెలుగులో ఒక మంచి సినిమా తీసి నన్ను నేను నిరూపించుకునే ఉద్దేశ్యంతో మంచి కథ, కథనాలతో ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. మా నిర్మాతలు కథ విని చాలా ఎగ్జైట్‌గా ఫీల్ అయి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో సుమన్, రాంకీ, బ్రహ్మానందం, ఇంద్రజ, తనికెళ్ల భరణి, పోసాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన ట్యూన్స్‌ని కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్ర కథ విషయానికొస్తే.. 'ఒక బిటెక్ చదువుకున్న కుర్రాడు అల్లరి చిల్లరిగా ఆకతాయిగా తిరుగుతుంటాడు. అలాంటి కుర్రాడి జీవితంలో అనుకోని సంఘటన ఎదురవుతుంది. దానిని నుండి అతను తెలివిగా ఎలా బయటపడ్డాడు అనేది చిత్ర కథాంశం. జూలై 22 నుండి పది రోజుల పాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతాం. తదుపరి షెడ్యూల్ వైజాగ్, కేరళలో జరిపి సాంగ్స్‌కి ఫారిన్ వెళుతున్నాం. 4 షెడ్యూల్స్‌లో సినిమాని కంప్లీట్ చేస్తున్నాం. కథకి అవసరమైన ఆర్టిస్ట్‌ల్ని, టెక్నీషియన్స్‌ని ప్రొవైడ్ చేసి ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా రిచ్‌గా ఈ సినిమాని నిర్మించడానికి మా నిర్మాతలు సహకరిస్తున్నారు'' అన్నారు.
హీరో ఆశిష్ రాజ్ మాట్లాడుతూ - ''రత్నశేఖర్ మాస్టర్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాను. మూడు సంవత్సరాలు థియేటర్ ఆర్టిస్ట్‌గా చేశాను. బాంబేలో కొన్ని యాడ్ ఫిలింస్, షార్ట్ ఫిలింస్‌లో నటించాను. మా నిర్మాతలు కాల్ చేసి మంచి కథ వుంది.. నువ్వు హీరోగా చెయ్యాలి అని చెప్పారు. రాం భీమన స్టోరీ చెప్పగానే చాలా ఇన్‌స్పైరింగ్‌గా అన్పించింది. బ్రిలియంట్ స్క్రిప్ట్ చెప్పారు. నా క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా వుంటుంది. యాక్టర్‌గా బాగా పెర్‌ఫార్మ్ చేసి మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం వుంది'' అన్నారు.
హీరోయిన్ రుక్సర్ మీర్ మాట్లాడుతూ - ''కన్నడంలో మూడు సినిమాలు చేశాను. తెలుగులో ఇది సెకెండ్ ఫిలిం. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. చాలా ఎగ్జైట్‌గా వుంది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. సీనియర్ యాక్టర్స్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.
కెమెరామెన్ వెంకట్ గంగధారి మాట్లాడుతూ - ''రాం భీమనతో కొన్ని ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలింస్‌కి వర్క్ చేశాను. 'ఆకతాయి' సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అన్పించి మళ్లీ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నాను. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో నేను ఓ భాగమైనందుకు చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.
సుమన్, రాంకీ, ఇంద్రజ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, కాదంబరి కిరణ్, అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ, నవీన్ నేని, తేజ కాకుమాను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, డిఓపి: వెంకట్ గంగధారి, ఎడిటింగ్: సురేష్ కుమార్, ఆర్ట్: మురళీ కొండేటి, పాటలు: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్, శ్రీమణి, ఫైట్స్: నందు, కొరియోగ్రఫీ: బన్ని సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లిక్, ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీరంగం సతీష్‌కుమార్, కో-డైరెక్టర్: సి. వెంకటేశ్వరరావు,
నిర్మాతలు: కె.ఆర్. విజయ్ కరణ్, కె.ఆర్.కౌషల్ కరణ్, కె.ఆర్. అనిల్ కరణ్.
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాం భీమన.