కోర్టు సమన్లు అందుకున్న ప్రొడ్యూసర్లు దామోధర్ ప్రసాద్ , వల్లూరిపల్లి రమేష్ బాబు
గత రెండు రోజులుగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ చైర్మన్ గొడవ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.రెండురోజులక్రితం నిర్మాతల సెక్టార్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కాదని సత్యారెడ్డిని ఎన్నుకొని ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెల్సిందే. దానికి మరుసటిరోజు ఆర్ కె గౌడ్ మరో ప్రెస్ మీట్ పెట్టి సత్యారెడ్డి ఎన్నిక చెల్లదంటూ 2017వరకు నేనే చైర్మన్ అని అమర్యాద పద్ధతిలో అతన్ని ఎన్నుకున్నారని కనీసం ఒక్కమాట కూడాచెప్పలేదని అసలు ఆ ఎన్నికకూడా నేను పరిమిషన్ ఇస్తేనే జరగాలి లేదా నేను రాజీనామా చెయ్యాలి లేదా నా పదవీకాలం ముగియాలి అంటూ కోర్ట్ ద్వారా దామోధర్ ప్రసాద్ , వల్లూరిపల్లి రమేష్ బాబు లకు ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో వారికీ కోర్ట్ ప్రతినిధి సమన్లను ఫిలింఛాంబర్ లో అందిచటంజరిగింది.
ఈ సందర్భంగా ఆర్.కె. గౌడ్ మాట్లాడుతూ..... నాపై కుట్ర జరిగింది చిన్న నిర్మాతలకు నేను అండగా ఉండటం కొంత మంది పెద్ద నిర్మాతలకు మింగుడు పడటంలేదు నేను థియేటర్స్ లీజుపై మరియు క్యూబ్ యు ఎఫ్ ఓ లపై గత ఏడు నెలలుగా కమిటీని సమావేశపరిచి చర్చించాలని అడగటం జరిగింది కానీ ఒక్కరుకూడా స్పందిచలేదు పక్క రాష్టాలలో క్యూబ్ ఒకవారానికి 2,500/-అందుబాటులో ఉండగా మన దగ్గరా 10,800/-వసూలు చేస్తున్నారు ఇది అన్యాయం అని అడగటం నేను చేసిన తప్పా? అలా అడిగినందుకు నన్ను టార్గెట్ చేశారు పెద్ద నిర్మాతలు. ఇంతకుముందు నేను తెలంగాణ ప్రభుత్తంతో మాట్లాడి సింగిల్ విండో విధానం రావాలని థియేటర్స్ లో ఐదు వా అటకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పుడున్న 20పెర్సెంట్ ట్యాక్స్ ని 7పెర్సెంటుగా తగ్గటానికి ప్రయత్నం చేశాను. కాబట్టి చిన్ననిర్మాతలకు అండగా ఉండేది వాళ్ళ? నేనా? కానీ నాయ్యం చేయటానికి కోర్ట్ అనేది ఒకటి ఉంటుందని వాళ్ళు మర్చిపోయారు 2017వరకు నిర్మాతల సెక్టార్ చైర్మన్ గా నేనే ఉండాలని కోర్టు ఈరోజు సమన్లు పంపింది. ఒకటి చెపుతున్న నేను చిన్న నిర్మాతలకు ఎప్పటికి అండగా ఉంటాను.