Rahul Movie Makers new movie titled ‘L7’

రాహూల్ మూవీ మేకర్స్
ఎల్7

'తుంగభద్ర' ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా, పూజ ఝవేరి హీరోయిన్ గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా, రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం 'ఎల్7'. ఈ చిత్ర నిర్మాత గతంలో 'ఈ వర్షం సాక్షిగా' వంటి పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాత బి. ఓబుల్ సుబ్బారెడ్డిగారు మాట్లాడుతూ "లవ్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా నిర్మించిన మా చిత్రం ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రేపే యూనిట్ సభ్యుల సమక్షంలో విడుదల చేస్తున్నాము. చిత్రం ఆడియోని అతి త్వరలో రిలీజ్ చేస్తున్నాము. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'ఇష్క్' చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అరవింద్ శంకర్ పని చేశారు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ద్వారా ముకుంద్ పాండేని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము. ఈయన గతంలో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యింది, మనం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కధ,           స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలలో పని చేశారు " అని అన్నారు.

ఆర్టిస్ట్స్

అరుణ్ ఆదిత్ (హీరో)
పూజ ఝవేరి (హీరోయిన్)
వెన్నెల కిషోర్
అజయ్

టెక్నీషియన్స్

సినిమాటోగ్రఫీ  :  దుర్గా ప్రసాద్
ఆర్ట్  : నాగ సాయి
సంగీతం : అరవింద్ శంకర్
లిరిక్స్  : శ్రీమణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  :  ఎం. కిషోర్
కో-ప్రొడ్యూసర్స్ : మోహనరావు .బి
సతీష్ కొట్టె
కె. పున్నయ్య చౌదరి
సమర్పణ  : మాస్టర్ ప్రీతమ్ రెడ్డి
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ముకుంద్ పాండే
నిర్మాత  : బి. ఓబుల్ రెడ్డి

Facebook Comments
Share

This website uses cookies.