ఓకే బంగారం విజయం తర్వాత దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో 100 డేస్ ఆఫ్ లవ్
విడుదల చేస్తున్నారు. ఎస్ ఎస్ సీ మూవీస్ సమర్ఫణలో ఎస్. వెంకట్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ విడుదల చేస్తోంది. జీనస్ మొహ్మద్ దర్శకత్వం వహిస్తు్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్ర ఆడియో సీడీని నితిన్ విడుదల చేసి, మొదటి సీడీని నానికి అందించారు.
నితిన్ మాట్లాడుతూ నిత్యామీనన్‌తో కలిసి ఇప్పటికి రెండు సినిమాలు చేశాను. నాని కూడా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు నిత్యామీనన్ పెద్ద స్టార్ రేంజ్‌కి ఎదిగింది. మేం ముగ్గురం కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది. అది కూడా వెంకట్‌కే చేయాలని ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ప్రొడక్షన్ మేనేజర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా, ఇప్పుడు ఈ సినిమా నిర్మాత స్థాయికి ఎదిగాడు వెంకట్. తనకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి
అని అన్నారు.
నాని మాట్లాడుతూ నిత్యా గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా నాకు గర్వంగా ఉంటుంది. తను మా `అలా మొదలైంది` సినిమాతో తెలుగులో కెరీర్‌ని మొదలుపెట్టింది. ఈ సినిమా మలయాళ ట్రైలర్ విడుదలైనప్పుడు చూశాను. చాలా క్యూట్‌గా అనిపించింది. సబ్ టైటిల్స్ తో చూద్దామని అనుకున్నా. ఇప్పుడు తెలుగులో హాయిగా చూడొచ్చు. సినిమా సంగీతం బావుంది. దర్శకుడు చిన్నవాడైనా చాలా కొత్తగా తెరకెక్కించారనిపిస్తోంది. నిత్యా, నేను, నితిన్ కలిసి ఓ సినిమా చేస్తే నిజంగానే చాలా బావుంటుంది
అని తెలిపారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ ఈ సినిమాను ఫ్రెండ్లీగా చేశాను. ఈ సినిమా టీమ్ అంతా నాకు మంచి ఫ్రెండ్స్. తెలుగు ఆడియన్స్ కి ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. కలర్స్, సెట్స్, షాట్స్, మ్యూజిక్ ఇలా ప్రతిదీ చాలా వైవిధ్యంగా ఆలోచించి చేశాం. హాలీవుడ్ స్థాయిలో ఉంటుందీ సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. వెంకట్‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఇందులో హృదయం అనే పాట నాకు చాలా ఇష్టం. పాటలు మలయాళంలో కన్నా తెలుగులో ఇంకా బాగా ఉన్నాయి
అని చెప్పారు.
కృష్ణచైతన్య మాట్లాడుతూ నాకు డబ్బింగ్ పాటలు రాయాలంటే చాలా భయం. ఆ ఫ్లేవర్ ఎక్కడ పడిపోతుందోనని భయపడుతాను. ఈ సినిమాకు మరింత కేర్ తీసుకుని రాశాను
అని చెప్పారు.
అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ మాట్లాడుతూ ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లోనూ మేం విడుదల చేస్తున్నాం
అని తెలిపారు. మా బ్యానర్ లో రిలీజ్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాల్ని సాధించాయి. మొదటిసారి మేము నిర్మాణంలో భాగస్వామ్యమైన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం.
దామోదరప్రసాద్ మాట్లాడుతూ వెంకట్ ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ప్రొడక్షన్ ఎందుకని నచ్చజెప్పాను. ఈ సినిమాతో ఏదో ఒకటి నిర్ణయించుకుంటానని చెప్పాడు
అని అన్నారు.
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, నితిన్, నిత్య మీనన్, నాని లకు మేనేజర్ గా ఉన్న నేను ఇప్పుడు సినిమా కు నిర్మాతను అయ్యాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఈ ముగ్గురే. నన్ను నమ్మి, నిత్య మీనన్ గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చేలా ఉంటుంది.
దర్శకుడు మొహ్మద్ మాట్లాడుతూ తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నిత్య ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది
అని తెలిపారు.
కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, జెమిని సురేశ్, క్రాంతి మాధవ్, గాంధీ మేర్లపాక, కె.పి.చౌదరి, ఏషియన్ సినిమాస్ సునీల్, యామినీ భాస్కర్, అన్నేరవి, అడవి శేష్ తదితరులు పాల్గొన్నారు.
This website uses cookies.