Friend Request team meet Dr.Dasari Narayana Rao

దర్శకరత్న డా|| దాసరి నారాయణరావుని కలిసిన 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' టీమ్‌

హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో మోడరన్‌ సినిమా పతాకంపై కొత్త హీరో, హీరోయిన్లతో విజయ్‌వర్మ పాకలపాటి సహనిర్మాతగా నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. రిలీజ్‌ విషయంలో ఈ చిత్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా చిత్ర యూనిట్‌ చేపట్టిన నిరాహార దీక్ష నాలుగు రోజుల అనంతరం హైదరాబాద్‌ సిటీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డా|| రాజేంద్రప్రసాద్‌ విరమింప జేసిన విషయం తెలిసిందే. కొంతమంది సినీ ప్రముఖుల ప్రమేయంతో ఈ చిత్రానికి హైదరాబాద్‌లో కొన్ని మల్టీప్లెక్స్‌లలో షోలు లభించాయి. తమ చిత్రం రిలీజ్‌ విషయంలో జరిగిన అన్యాయం మరే ఇతర చిన్న నిర్మాతలకు జరగకూడదన్న ఉద్దేశంతో ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చిత్ర దర్శకుడు ఆదిత్య ఓం, నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి తెలియజేశారు.

ఈ క్రమంలో బుధవారం దర్శకరత్న డా|| దాసరి నారాయణరావును ఆయన నివాసంలో ఆదిత్య ఓం, విజయ్‌వర్మ కలిసి పరిస్థితిని వివరించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా వుండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రతి థియేటర్‌లో 5వ షోను కూడా ప్రదర్శించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానివల్ల చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించే విషయంలో కొంత మేలు జరుగుతుందని ఆయన తెలియజేశారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%