Aavu Puli Madhyalo Prabhas Pelli trailer with Kabali

క‌బాలి తో ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి ట్రైల‌ర్‌

మెట్ట‌మెద‌టి సారిగా రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కోసం చేస్తున్న చిత్రం ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి.  ఆ చిత్రానికి సంభందించిన మెష‌న్ పోస్ట‌ర్ ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఇప్పుడు ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సారి సౌత్ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ కాంత్ హీరోగా మెస్ట్ క్రేజియ‌స్ట్ ఫిల్మ్ క‌బాలి చిత్రంతో పాటు క‌బాలి తెర‌పై ఈ ట్రైల‌ర్ అల‌రించ‌నుంది. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అగ‌ష్టులో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్ప‌ణ‌లో, రెడ్ కార్పేట్ రీల్స్ ప‌తాకం పై, ఏ.ర‌వితేజ‌, అశ్విని చంద్ర‌శేఖ‌ర్‌, భానుశ్రీ, జ‌బ‌ర్ద‌స్ట్ వేణు, అప్పారావు లు న‌టించ‌గా, బాహుబ‌లి కాళ‌కేయుడు ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించారు. ఎస్‌.జె.చైత‌న్య ద‌ర్శ‌కుడు. క‌బాలి విడుద‌ల రోజునుండి ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో అన్ని స్క్రీన్స్ లో ఈ ట్రైల‌ర్ వ‌స్తుంది.
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ మీద వారి అభిమానుల మీద చిత్రీక‌రించిన మెట్ట‌మెద‌టి చిత్రం మా ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి. ఇటీవ‌లే మెష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశాము. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సంవ‌త్స‌రం క్రితం భాహుబ‌లి చిత్రం అనేది మ‌న తెలుగు సినిమా సత్తాని భార‌తదేశం అంతా తెలియ‌జెప్పింది. అలాంటి చిత్రంలో హీరోగా ప్ర‌భాస్ అభిమానుల కోసం ఈ చిత్రం తీయ‌టం మాకు చాలా ఆనందంగా వుంది. బుజ్జిగాడు చిత్రంలో ప్ర‌భాస్, ర‌జ‌నీకాంత్ గారి అభిమానిగా న‌టించారు. ఇప్పుడు మా చిత్రం ట్రైల‌ర్ ని ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రంతో పాటు అన్ని దియోట‌ర్స్ లో వ‌స్తుంది. బ్లాక్ కామెడి తో విభిన్న‌శైలిలో, నెల్లూరు నేప‌థ్యాన్ని, నెల్లూరు భాష‌ని సినిమా మెత్తం ఉప‌యోగించాము. ఈ చిత్ర నిర్మాత ర‌వి ప‌చ్చిపాల ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగష్టులో విడుదల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నాము. అన్నిఅన్నారు.

శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్ప‌ణ‌
రెడ్ కార్పేట్ రీల్స్ ప‌తాకం
న‌టీన‌టులు.. ఏ.ర‌వితేజ‌, అశ్విని చంద్ర‌శేఖ‌ర్‌, భానుశ్రీ, జ‌బ‌ర్ద‌స్ట్ వేణు, అప్పారావు లు న‌టించ‌గా, బాహుబ‌లి కాళ‌కేయుడు ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించారు.

సంగీతం- ఎమ్‌.టి.క‌విశంక‌ర్‌,
కెమెరా- ఆర్లి
స‌హ‌నిర్మాత‌లు- న‌గరం సునీల్, మ‌ధుమ‌ణినాయిడు,
నిర్మాత‌- ర‌వి ప‌చ్చిపాల‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం- ఎస్‌.జె.చైత‌న్య.

Facebook Comments
Share

This website uses cookies.