Social News XYZ     

Manchu Lakshmi’s Lakshmi Bomb in regular shoot

రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటున్న మంచు లక్ష్మీ ప్రసన్న ‘లక్ష్మీ బాంబ్’

Manchu Lakshmi's Lakshmi Bomb in regular shoot

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న‌ కొత్త చిత్రం లక్ష్మీ బాంబ్.  ఫ్రమ్ శివకాశి ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా రెగ్యుల‌ర్‌షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సందర్భంగా..
దర్శకుడు కార్తీకేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ "మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్. మంచు లక్ష్మీగారు జడ్జ్ పాత్రలో న‌టిస్తున్నారు. ఆమె రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది’’ అన్నారు.

చిత్ర నిర్మాత‌లు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ మాట్లాడుతూ "దీపావళి టపాసుల్లో లక్ష్మీ బాంబ్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ సినిమాలో లక్ష్మీ గారి పాత్ర అలా ఉంటుంది. ద‌ర్శ‌కుడు కార్తికేయ గోపాల‌కృష్ణ‌గారు మంచి ల‌క్ష్మిగారిని చాలా కొత్త‌గా, ప‌వ‌ర్‌పుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్టు వ‌ర‌కు జ‌రుగుతుంది. ఈ సింగిల్ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ పూర్త‌వుతుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు వీలైనంత త్వ‌ర‌గా తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం`` అన్నారు.

 

మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, హేమ‌, ప్ర‌భాక‌ర్‌, హేమంత్‌, రాకేష్‌, అమిత్‌, జీవా, రాజ‌బాబు,  శ‌ర‌త్, రాజార‌వీంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: డార్లింగ్ స్వామి, ఆర్ట్: రఘుకులకర్ణి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః పి.ఎల్‌.ఎమ్‌.ఖాన్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః దిలీప్ సింగ్‌, సంగీతం: సునీల్ కశ్యప్, ఫోటోగ్రఫీ:  జోషి, స‌హ నిర్మాతలుః ముర‌ళి, సుబ్బారావ్‌, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ

Facebook Comments