‘Crazy Crazy Feeling’ song from Nenu Sailaja crosses 1 crore views on Youtube

కోటికి పైగా వ్యూస్‌తో
రికార్డు సృష్టించిన
`క్రేజీ క్రేజీ ఫీలింగ్‌` సాంగ్‌

కాంపౌండ్ వాలెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాలెక్కి మూను తాకిన‌ట్టుందే అని క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ ని నేను శైల‌జ‌లో అంద‌రూ విన్నారు. విన‌డమే కాదు యూట్యూబ్‌లో ఏకంగా కోటి మందికి పైగా వీడియో కూడా చూశారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతంలో పృథ్వి చంద్ర పాడిన ఈ పాట‌కు కోటికి పైగా వ్యూస్ వ‌చ్చాయి. దీంతో దేవిశ్రీ ప్ర‌సాద్ టీమ్‌తో పాటు చిత్ర యూనిట్ కూడా ఆనందాన్ని షేర్ చేసుకుంటోంది. రామ్ హీరోగా న‌టించిన నేను శైల‌జ‌ 2016, జ‌న‌వ‌రి 1న విడుద‌లైంది. ఈ ఏడాది సినీ ఇండ‌స్ట్రీకి హిట్ టాక్‌తో నాంది ప‌లికిందీ చిత్రం. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమా యువ‌త‌తో పాటు ఫ్యామిలీస్‌కు కూడా బాగా క‌నెక్ట్ అయింది. ఓ వైపు యువ‌కుడి క్రేజీ ఫీలింగ్స్ ని చూపిస్తూనే మ‌రోవైపు తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించారు కిశోర్ తిరుమ‌ల‌. తండ్రిగా స‌త్య‌రాజ్‌, కూతురిగా కీర్తి సురేశ్ చ‌క్క‌గా అభిన‌యించి, అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. సంద‌ర్భోచితంగా దేవిశ్రీ ప్ర‌సాద్ చేసిన ట్యూన్లు కూడా చార్ట్ బ‌స్టర్స్ అయ్యాయి. అందులో భాగంగానే కాంపౌండ్ వాలెక్కి అనే పాట యూట్యూబ్‌లో ఏకంగా కోటికి పైగా వ్యూస్‌ని తెచ్చుకుంది.

ఈ పాట గురించి చిత్ర నిర్మాత స్ర‌వంతి ర‌వికిశోర్ మాట్లాడుతూ ఈ న్యూ ఇయ‌ర్ రోజున విడుద‌లైన మా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డం మా యూనిట్‌కి చాలా ఆనందాన్ని క‌లిగించింది. పాట‌లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచి అన్ని చోట్లా వినిపించాయి. సినిమా విడుద‌లై ఆరు నెల‌లైనా ఇప్ప‌టికీ పాట‌ల‌న్నీ మారుమోగుతూనే ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా `కాంపౌండ్ వాలెక్కి..` అనే పాట చాలా బాగా క్లిక్ అయింది. ప్రేమ‌లో ప‌డ్డ కుర్రాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో రామ‌జోగ‌య్య‌శాస్త్రిగారు చాలా చ‌క్క‌టి ఉప‌మానాల‌తో ఇందులో రాశారు. దానికి త‌గ్గ‌ట్టు పృథ్వి చంద్ర కూడా మంచి ఫీల్‌తో పాడారు. దేవిశ్రీ ప్ర‌సాద్ కంపోజింగ్ హైలైట్‌గా అనిపించింది. ఎన్ని సార్లు విన్నా ఇంకో సారి వినాల‌నిపించేలా ఉంటుంది. ఈ పాట‌కు కోటికి పైగా వ్యూస్ రావ‌డం చాలా ఆనందాన్ని క‌లిగించే విష‌యం. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిన విష‌యాల‌ను అంద‌లాల‌ను ఎక్కిస్తార‌నే విష‌యం మ‌రోసారి రుజువైంది అని అన్నారు.

హీరో రామ్ త‌న ట్విట్ట‌ర్‌లో యూట్యూబ్‌లో క్రేజీ ఫీలింగ్ పాట‌కు ప‌ది మిలియ‌న్ల‌ ప్ల‌స్ వ్యూస్ రావ‌డం ఆనందంగా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్‌కు, రామ‌జోగయ్య‌శాస్త్రికి థాంక్స్ అని స్పందించారు.

నేను శైల‌జ‌ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుద‌లైంది. కృష్ణ‌చైత‌న్య ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%