Social News XYZ     

Devi Sri Prasad movie announced

విలక్షణ చిత్రాల దర్శకుడు శ్రీ కిషోర్ కొత్త చిత్రం `దేవిశ్రీప్రసాద్`

Devi Sri Prasad movie announced

స‌శేషం,భూ చిత్రాల‌తో తెలుగు సినీ అభిమానులు, ప్రేక్ష‌కుల సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ హ్యాట్రిక్ చిత్రం దేవిశ్రీప్రసాద్‘ ను తెరకెక్కించడానికి సిద్‌ోమ‌య్యారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో, ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో కూడిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమాను స‌రికొత్త రీతిలో తెర‌కెక్కించేలా శ్రీ కిషోర్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ క‌మెడియ‌న్‌తో పాటు  ఇద్ద‌రు ప్ర‌ముఖ హీరోలు, ఓ ప్ర‌ముఖ హీరోయిన్ న‌టిస్తుండ‌టం విశేషం. సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.దేవిశ్రీప్రసాద్` అనే టైటిల్ ప్రేక్షకుల్లో ఓ ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు.

ఇలా టైటిల్ తో పాటు పోస్టర్ డిజైనింగ్ నుండి ప్ర‌తి విష‌యంలో ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ కొత్త పంథాలో యోచిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిక‌ల్ టీం వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.

 

Facebook Comments

%d bloggers like this: