తమిళంలో ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన 'మెట్రో' చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. మొదటి వారమే 16 కోట్లు కలెక్ట్ చేసి తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి తెలుగులో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ప్రేమిస్తే', 'జర్నీ' వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం లవ్‌లీ రాక్‌స్టార్ ఆది హీరోగా 'చుట్టాలబ్బాయి' చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ తాళ్ళూరి 'మెట్రో' చిత్రం రీమేక్ హక్కులను భారీ పోటీ మధ్య ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకున్నారు. తెలుగు రీమేక్‌లో ఓ యంగ్ హీరో కథానాయకుడిగా నటిస్తారు. యాక్షన్, డ్రామా నేపథ్యంలో అద్భుతమైన థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని కథ, కథనాలు తెలుగు నేటివిటీకి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. జూన్ 24న తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రముఖుల ప్రశసలతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
ఈ సంచలన చిత్రం రీమేక్ హక్కులు దక్కించుకున్న సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ - ''ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అద్భుతంగా రూపొందిన చిత్రమిది. బాబీ సింహ, సేంద్రయాన్, శిరీష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న చైన్ స్నాచింగ్ గురించి పేపర్ల ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా తెలుసుకుంటూనే వున్నాం. ఇలాంటి చైన్ స్నాచింగ్‌లు జీవితాల్లో ఎలాంటి చిచ్చులు పెడతాయనే ఆసక్తికరమైన అంశాన్ని తీసుకొని రూపొందించిన చిత్రం 'మెట్రో'. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రం తమిళ్‌లో సంచలన విజయం సాధించి మొదటి వారమే 16 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు మా సంస్థకు లభించడం చాలా ఆనందంగా వుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఓ యంగ్ హీరో ప్రధాన పాత్ర పోషించే ఈ చిత్రంలో నటించే మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.
This website uses cookies.