Madhavi Latha’s ‘On Mona’s Birthday’ Short Film Special Show Screened

సినీ ప్రముఖుల సమక్షంలో హీరోయిన్ మాధవి లత నటించిన ఆన్ మోనాస్ బర్త్ డే షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో

నచ్చావులే ఫేం మాధవి లత నటించిన ఆన్ మోనాస్ బర్త్ డే షార్ట్ ఫిలిం ప్రదర్శన ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. నరేంద్ర నాథ్ రచయిత, దర్శకుడు. మాధవి లతతో పాటు విపిఎస్ కళ్యాణ్, మాస్టర్ కుషాల్, సాయి కిృష్ణ ఇందులో నటించారు. లోఫర్ ఫేం సునీల్ కశ్యప్ సంగీతమందించారు. అనిల్ భాను డిజైన్స్ చేయడం విశేషం. ల్యుమియర్ సినిమా బ్యానర్ పై కృష్ణ ఈ షార్ట్ ఫిలింను గ్రాండియర్ గా నిర్మించారు. ఈ స్పెషల్ ప్రీమియర్ షోను రచయిత భాస్కర భట్ల, నిర్మాతలు రాజ్ కందుకూరి, సురేష్ బాబు, దర్శకుడు శేఖర్ సూరి, హీరో శ్రీ,, సింగర్స్, మధు, లిప్సిక, నటి పూజాశ్రీ వంటి పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు.

ఈ సందర్భంగా రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ... నరేంద్ర నాథ్ నాకు చాలా కాలంగా తెలుసు. పూరీ దగ్గరికి వస్తుండే వాడు. షార్ట్ ఫిలింస్ అనే ఫ్లాట్ ఫాం ద్వారా తన టాలెంట్ చూపిస్తున్నాడు. చాలా మంచి కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిలిం రూపొందించాడు. దీని తర్వాత నరేంద్ర నాథ్ పెద్ద డైరెక్టర్ అవుతాడనే నమ్మకం నాకుంది. అని అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... షార్ట్ ఫిలిం లో బర్త్ డే మెసేజ్ ను, చిన్న పిల్లాడి ద్వారా చాలా బాగా చెప్పారు. కాన్సెప్ట్ రాసుకోవడం వేరు కన్వే చేయడం వేరు. నరేంద్రలో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. నేను అతన్ని మిస్ అయ్యాను. ఈ తరహా క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. మాధవి లత తనకున్న ప్యాషన్ ను ప్రూవ్ చేసుకుంది. అనిల్ భాను డిజైన్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ఇలా టాలెంట్ ఉన్న వారిని నేనెప్పుడూ ఎంకరేజ్ చేస్తాను. అని అన్నారు.

దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ... మాధవి లత చాలా ప్రాక్టికల్ మనిషి. నన్ను ఈ పోస్టర్స్ బాగా ఎట్రాక్ట్ చేశాయి. షార్ట్ ఫిలిం చూశాక నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గుర్తుకు వచ్చాయి. సందర్భాన్ని బట్టి మనుషుల ఆలోచనా తీరు మారుతుంది. ఓ చిన్న అబ్బాయి చెప్పే మాటల ద్వారా అమ్మాయి మారడమేది రియల్ లైఫ్ లో నూ జరుగుతుంటాయి. అని అన్నారు.

హీరో శ్రీ మాట్లాడుతూ.... మాధవిలత బోల్డ్ అటెంప్ట్ ఇది. నరేంద్ర నాథ్ చాలా బాగా తెరకెక్కంచాడు. కాన్పెప్ట్ తగ్గట్టుగా రిచ్ గా ఉంది. అని అన్నారు.

నిర్మాత కృష్ణ మాట్లాడుతూ... నా ఫీల్డ్ ఇది కాకపోయినా... నేను ఇంత మంచి షార్ట్ ఫిలిం చేస్తా అనుకోలేదు. నరేంద్ర చెప్పిన కాన్పెప్ట్ నచ్చి చేశాను. త్వరలోనే వన్ హవర్ ఫిలింను నరేంద్ర డైరెక్షన్ లోనే నిర్మిస్తాను.

నరేంద్ర నాథ్ మాట్లాడుతూ... మాధవి లతకు కాన్పెప్ట్ చెప్పిన తర్వాత అర్థం చేసుకుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయాలంటే ముందు కాన్సెప్ట్ అర్థం కావాలి. వంద శాతం న్యాయం చేసింది. నా టీం సపోర్ట్ లేకపోతే ఇంత బాగా వచ్చేది కాదు. లిప్సిక డబ్బింగ్ చాలా బాగా హెల్ప్ అయ్యింది. మాధవి, డిజైనర్స్ అనిల్ భాను, సునీల్ కశ్యప్ వంటి ప్రొఫెషనల్స్ తో వర్క్ చేస్తే వచ్చే సంతృప్తి వేరు. ప్రొడ్యూసర్స్, నా ఫ్యామిలీ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఈ షార్ట్ ఫిలిం చేయడానికి అర్థం ఉంది. నేను త్వరలోనే ఫీచర్ ఫిలిం చేస్తాను. దానికి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అని అన్నారు.

మాధవి లత మాట్లాడుతూ... నాలుగేళ్ల క్రితం నరేంద్ర కలిసినప్పుడు మంచి షార్ట్ ఫిలిం చేస్తా అని చెప్పాను. ఇప్పటికి ఓ మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాం. నరేంద్ర చాలా కాన్ఫిడెంట్ గా చేశాడు. ఇట్స్ ఏ టీం వర్క్. మాస్టర్ కుషాల్ ఇంటల్లిజెంట్ కిడ్. అని అన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%