Social News XYZ     

Mahesh wishes ‘Nirmala Convent’ team all the best

'నిర్మల కాన్వెంట్‌' డిజిటల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన కింగ్‌ నాగార్జున
టీమ్‌కి విషెస్‌ తెలిపిన సూపర్‌స్టార్‌ మహేష్‌

Mahesh wishes 'Nirmala Convent' team all the best

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మల కాన్వెంట్‌'. ఈ చిత్రం డిజిటల్‌ ట్రైలర్‌ను కింగ్‌ నాగార్జున ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశారు.
కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''నిర్మల కాన్వెంట్‌ ఫ్రెష్‌ ప్యూర్‌ లవ్‌స్టోరీ. నాకు లవ్‌స్టోరీలంటే చాలా ఇష్టం. ఈ చిత్రం ద్వారా రోషన్‌ను హీరోగా పరిచయం చేయడం చాలా ఆనందంగా వుంది. గుడ్‌ లక్‌ రోషన్‌'' అన్నారు.

'నిర్మల కాన్వెంట్‌'కు సూపర్‌స్టార్‌ మహేష్‌ విషెస్‌

 

ఈ చిత్రం ట్రైలర్‌ను చూసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ 'నిర్మల కాన్వెంట్‌' టీమ్‌ని విష్‌ చేస్తూ ''నిర్మల కాన్వెంట్‌' టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అంటూ ట్విట్టర్‌ విషెస్‌ తెలియజేశారు.

కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

Facebook Comments

%d bloggers like this: