Social News XYZ     

Aadi’s Chuttalabbayi to release on July 22nd

జూలై 22న ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి'

Aadi's Chuttalabbayi to release on July 22nd

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఒక పాట మినహా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా రీరికార్డింగ్‌ జరుగుతోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను జూలై 16న, చిత్రాన్ని జూలై 22న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన టీజర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. వీరభద్రమ్‌గారు ఈ చిత్రాన్ని చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఆది పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌ అవుతుంది. ఒక పాట మినహా టోటల్‌గా షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం రీరికార్డింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి థమన్‌గారు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ని చేశారు. ఈ ఆడియోను జూలై 16న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే చిత్రాన్ని జూలై 22న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

 

దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ - ''ఒక మంచి కథని కుటుంబ సమేతంగా అందరూ చూసి ఆనందించేలా రూపొందించడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని నేను అనుకున్నట్టుగా తీయడంలో నిర్మాతల సహకారం ఎంతో వుంది. బడ్జెట్‌కి వెనకాడకుండా అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఈ చిత్రానికి థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ చేశారు. ఈ సినిమాకి పాటలు చాలా పెద్ద హైలైట్‌ అవుతాయి. నాకు, ఆదికి ఈ సినిమా మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.

Facebook Comments

%d bloggers like this: