Social News XYZ     

Allari Naresh’s next to be produced by Jhanvi Films

అల్లరి నరేష్‌తో జాహ్నవి ఫిలిమ్స్ చిత్రం

Allari Naresh's next to be produced by Jhanvi Films

కామెడీ చిత్రాల కథానాయకుడిగా మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు అల్లరి నరేష్‌ హీరోగా త్వరలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ తాజా చిత్రానికి ప్రముఖ రచయిత, నటుడు కృష్ణభగవాన్‌ కథ, మాటలు అందిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించనున్నారు. 'అలాఎలా' చిత్ర విజయంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యువ దర్శకుడు అనీష్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ..'వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే హీరో అల్లరి నరేష్‌తో 'కెవ్వుకేక' చిత్రం తర్వాత మా బ్యానర్‌లో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, రచయిత కృష్ణభగవాన్‌ అందించే కథ, మాటలు హైలైట్‌గా నిలుస్తాయి. నరేష్‌ బాడీ లాగ్వేంజ్‌కి సరిపోయే వైవిధ్యమైన కథ ఇది. తొలి చిత్రం 'అలాఎలా'తో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల అభినందనలు అందుకున్న అనీష్‌కృష్ణ తప్పకుండా ఈ చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దుతాడనే నమ్మకం ఉంది. సెప్టెంబర్‌ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాము. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేస్తాము...అన్నారు.

 

ఈ చిత్రానికి సంగీతం: డి.జె. వసంత్‌, కథ-మాటలు: కృష్ణభగవాన్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీష్‌కృష్ణ.

Facebook Comments