కంటెంట్ ఉంటే కటౌట్ చాలు..సినిమా డైలాగే అయినా దేంట్లో అయినా విషయముంటే చాలు దూసుకెళ్లిపోవడం ఖాయం. ఈ విషయాన్ని 'బిచ్చగాడు' సినిమా నిరూపించింది. తెలుగు ప్రేక్షకులకు సినిమా బావుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాను పెద్ద హిట్ చేస్తారనడానికి మరో నిదర్శనం కూడా బిచ్చగాడు సినిమాయే.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో చదలవాడ పద్మావతి మే 13న విడుదల చేశారు. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్ర ప్రభంజనం రోజు రోజుకు పెరిగిందే తప్ప తగ్గలేదు. ..ఎవరినోట విన్నా 'బిచ్చగాడు' సినిమా బావుందనే అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టైటిల్ లోని ట్యాగ్ లైన్ కు తగిన విధంగా కోట్ల రూపాయల కలెక్షన్స్ ను రాబట్టి విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఓ రకంగా చెప్పాలంటే మాతృక తమిళంలో కూడా సినిమా హిట్టయ్యింది కానీ తెలుగులో సాధించినంత పెద్ద సక్సెస్ సాధించలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఆంధ్రాలో రూపాయలు 7,93,87,581/- సీడెడ్ లో రూపాయలు 5,14,56,649/- నైజాంలో రూపాయలు 5,03,50,696/- కలెక్షన్స్ సాధించి మొత్తంగా రూపాయలు 18,11,94,926/-తో విజయపథంలో దూసుకెళుతుంది. ఇంకా సినిమా ఆదరణ తగ్గకపోవడంతో కలెక్షన్స్ మరింత వచ్చే అవకాశం ఉందని నిర్మాతలు అంటున్నారు. వసూళ్ళ పరంగా బిచ్చగాడు సెన్సేషన్ క్రియేట్ చేసింది.
This website uses cookies.