విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ స్టూడియోస్, వినూతన గీత బ్యానర్స్ పై రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ 'పెళ్ళి చూపులు'. ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న టెస్ట్ ఫుల్ నిర్మాత రాజ్ కందుకూరి, యస్ రాగినేనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా....
ఈ చిత్రం గురించి నిర్మాతలు నిర్మాత రాజ్ కందుకూరి, యస్ రాగినేనిమాట్లాడుతూ 'ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హీరోహీరోయిన్ల నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజరు దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందనడానికి నిదర్శనంగా నిలిచే చిత్రమిది. నవ్యమైన కథతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నేచురల్ స్టార్ నాని ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆయన టీజర్ ను, కొన్ని పోస్టర్స్ ను చూసి చాలా బావున్నాయని యూనిట్ ను అభినందించారు. అందుకు ఆయనకు థాంక్స్. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’' అని అన్నారు.
విజయ్ దేవర కొండ, రీతూవర్మ, ప్రియదర్శిని, అభయ్ బేతిగంటి, కేదార్ శంకర్, గురురాజ్, అనీష్ కురువిల్లా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్, మ్యూజిక్: వివేక్ సాగర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రంజిత్ కుమార్, నిర్మాతలు: నిర్మాత రాజ్ కందుకూరి, యస్ రాగినేని దర్శకత్వం: భాస్కర్.
This website uses cookies.