తెలుగు చిత్రసీమలో రచయితగా తన పెన్ పవర్ ను ప్రూవ్ చేసుకోవడానికి వస్తున్న మరో రైటర్ రవివర్మ నంబూరి. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన రవివర్మకు సినిమాలంటే అమితమైన అభిమానం. ఆ అభిమానంతోనే ఉద్యోగం చేస్తూనే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. సదరు షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఇప్పుడు ఫీచర్ ఫిలిమ్ కు రైటర్ గా అవకాశం దక్కించుకొన్నాడు. రచయితగా రవివర్మ ప్రస్థానం ఎలా మొదలైంది? "రోజులు మారాయి" చిత్రానికి రచయితగా పనిచేసే అవకాశం ఎలా వచ్చింది? వంటి విషయాలు రవివర్మ మాటల్లోనే..!!
కవితలు రాసుకొనేవాడ్ని..
సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉన్నప్పుడే అప్పుడప్పుడూ కవితలు రాసుకొనేవాడ్ని. అది చూసిన నా ఫ్రెండ్స్ షార్ట్ ఫిలిమ్స్ తీయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. అలా ఓ రెండు షార్ట్ ఫిలిమ్స్ తీశాను. ఆ షార్ట్ ఫిలిమ్స్ కు డబ్బింగ్ చెప్పిస్తున్న తరుణంలో నేను రాసిన డైలాగ్స్ నచ్చిన ఓ టెక్నీషియన్ నన్ను "రోజులు మారాయి" డైరెక్టర్ మురళీకృష్ణగారికి పరిచయం చేశారు. మురళీగారు మారుతిగారికి పరిచయం చేశారు. ఆ విధంగా రైటర్ గా నా ప్రస్థానం మొదలైంది.
మొదట ఫస్టాఫ్ రాయమన్నారు..
మారుతిగారు నన్ను కలిసిన మొదటిరోజు.. కథ చెప్పి, ఫస్టాఫ్ డైలాగ్స్ రెడీ చేయమన్నారు. ఆయన చెప్పినట్లుగా ఫస్టాఫ్ డైలాగ్ వెర్షన్ ను రెడీ చేసి ఆయనకు చూపించాను. ఆయనకి విపరీతంగా నచ్చేయడంతో షూటింగ్ మొదలెట్టేశాం. అలా ఫుల్ లెంగ్త్ రైటర్ గా నా మొదటి సినిమా మొదలైంది.
అప్పుడు మాత్రం చాలా భయపడ్డాను..
మారుతిగారు ఈ కథను దిల్ రాజు గారికి చెప్పాలి అన్నారు. డైలాగ్స్ రాయడం వరకూ ఒకే కానీ.. స్టోరీ నేరేట్ చేయడం, అది కూడా దిల్ రాజు లాంటి నిర్మాతకు చెప్పాలంటే భయమేసింది. అయితే.. అప్పటికే నేణు రాసిన ఫస్టాఫ్ చదివిన రాజుగారు, నేను చెప్పిన కథను విని.. రెండుమూడు మార్పులు చెప్పి కథను ఒకే చేశారు.
జాతకం కీలకాంశం..
"రోజులు మారాయి" చిత్రంలో జాతకం అనేది కీలకపాత్ర పోషిస్తుంది. ఇద్దరు అమ్మాయిల జీవితంలో "జాతకం" ఎటువంటి కీలకపాత్ర పోషించింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన సినిమా. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ.. ఫ్యామిలీస్ కూడా చూడదగ్గ సినిమాగా "రోజులు మారాయి" తెరకెక్కింది.
చాలా సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా..
ఇప్పటికే చాలా సినిమాలకు డైలాగ్ రైటర్ గా వర్క్ చేశాను. ముఖ్యంగా.. "స్పీడున్నోడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ" సినిమాలకు టైటిల్ క్రెడిట్ కూడా లభించింది. కానీ.. ఆ సినిమాలకు నేను సోలో రైటర్ ను కాను. నేను పూర్తి స్థాయి రచయితగా పనిచేస్తున్న మొదటి సినిమా "రోజులు మారాయి".
ఇప్పుడు ఉద్యోగం మానేశాను...
ఇదివరకే చాలా సినిమాలకు రైటర్ గా పనిచేశాను. అయితే.. నా సాఫ్ట్ వేర్ జాబ్ ను కంటిన్యూ చేస్తూనే ఆ సినిమాలకు వర్క్ చేశాను. కానీ.. ఇప్పుడు రచయితగా వరుస అవకాశాలతోపాటు సపోర్ట్ కూడా లభించడంతో నా జాబ్ కూడా మానేశాను. ఇప్పుడు నా దృష్టి మొత్తం సినిమాల మీదే.
ఆ ఇద్దరి ప్రభావం ఉంటుంది..
నేను చిన్నప్పట్నుంచి జంధ్యాలగారి సినిమాలు చూస్తూ పెరిగాను. జంధ్యాల గారి తర్వాత నాకు నచ్చిన రచయిత త్రివిక్రమ్ గారు. సో, రైటర్ గా నా మీద జంధ్యాలగారు మరియు త్రివిక్రమ్ ల ఇంపాక్ట్ ఉంటుంది. అలా అని వారిని కాపీ కొడుతున్నానని కాదు.. వారి శైలి నన్ను ప్రభావితం చేశాయని.
నా ఎంట్రీ చాలా ఈజీగా అయ్యింది..
ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే టాలెంట్ తోపాటు లక్ కూడా ఉండాలి. అయితే.. వారకూ ఇండస్ట్రీ ఎంట్రీ చాలా ఈజీగా జరిగిపోయింది. అందువల్ల నా విషయంలో టాలెంట్ కంటే లక్కే కీలకపాత్ర పోషించింది!
This website uses cookies.