అల్లరి, అనసూయ, అవును వంటి డిఫరెంట్ కామెడి, లవ్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కించి డైరెక్టర్‌గా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రవిబాబు. ఇప్పుడు మరి కాస్తా డిఫరెంట్‌గా పందిపిల్లపై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా...
దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ "ఏడాదిన్నర క్రితం నాకు ఈ సినిమా ఆలోచన వచ్చింది. అందుకోసం మన తెలుగు ఆడియెన్స్‌కు తగిన విధంగా స్క్రిప్ట్‌ను తయారుచేశాను. పందిపిల్ల ఎలా ప్రవర్తిస్తుంది అనే దానిపై స్టడీ కూడా చేశాను. యానీమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనికావడంతో సిలికాన్‌తో పందిపిల్ల మోడల్‌ను తయారుచేశాం. అయితే సినిమా చిత్రీకరించే సమయంలో ఆ మోడల్ విరిగిపోయింది. దాంతో నిజమైన పందిపిల్లతోనే సినిమా చిత్రీకరణ చేశాం. అలాగే రియల్‌గా చిత్రీకరించలేని కొన్ని షాట్స్‌ను యానీమెట్రోనిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విజువల్ ఎఫెక్ట్స్‌లో క్రియేట్ చేశాం. మార్చిలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి మూడు నెలల్లో పూర్తి చేశాం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి" అన్నారు.
పందిపిల్ల ప్రధానపాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అభిషేక్, నాభ లీడ్ రోల్స్ చేస్తున్నారు. రాజమౌళి ఈగ తర్వాత రవిబాబు పందిపిల్లపై తీస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ వార్తల్లో నిలుస్తుందనడంలో సందేహం లేదు.
This website uses cookies.