‘Brahmana’ Trailer Launched By Dr.Dasari Narayana Rao

"బ్రాహ్మణ" కూడా "దండుపాళ్యం"లా బ్రహ్మాండంగా ఆడడం ఖాయం!!
-ఆడియో ఆవిష్కరించి ఆశీర్వదించిన డా. దాసరి

"దండుపాళ్యం" చిత్రంతో అటు కన్నడలోనూ.. ఇటు తెలుగులోనూ సంచలనం సృష్టించిన శ్రీనివాస్ రాజు దర్సకత్వంలో.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా రూపొంది ఘన విజయం సాధించిన "శివం" చిత్రం తెలుగులో "బ్రాహ్మణ" పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. సి.ఆర్.మనోహర్ సమర్పణలో.. విజి చెరిష్ విజన్స్ మరియు శ్రీ తారకరామ పిక్చర్స్ బ్యానర్స్ పై.. విజయ్.ఎమ్- గుర్రం మహేష్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుంటూరి కేశవులు నాయుడు సహ నిర్మాత. ఉపేంద్ర సరసన సలోని (మర్యాద రామన్న ఫేం), రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం మణిశర్మ స్వర సారధ్యం వహించారు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఆడియోను దర్శక రత్న దాసరి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దాసరి మాటాడుతూ.. "తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న ఉపేంద్ర నటించిన "శివమ్" చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. తెలుగులోనూ బ్రహ్మాండంగా ఆడుతుందనే నమ్మకం ఉంది. "బ్రాహ్మణ" చిత్రానికి మణిశర్మ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ చాలా బాగున్నాయి. చిత్ర నిర్మాతలు విజయ్, మహేష్ లను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను" అన్నారు.
నిర్మాతలు విజయ్-మహేష్ చౌదరి మాట్లాడుతూ.. "దాసరిగారి చేతుల మీదుగా "బ్రాహ్మణ" పాటలు విడుదల కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

చిత్ర దర్శకులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. "దాసరిగారికి నేను చాలా పెద్ద అభిమానిని. ఆయన తీసిన సినిమాలన్నీ మాలాంటి దర్శకులకు పాఠ్య పుస్తకాలు వంటివి. అంతటి గొప్ప దర్శకుడు "బ్రాహ్మణ" ఆడియో రిలీజ్ చేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. "దండుపాళ్యం నచ్చిన ప్రతి ఒక్కరికీ "బ్రాహ్మణ" కూడా తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.

ఈ చిత్రాన్ని ఆంధ్ర-తెలంగాణలో రిలీజ్ చేస్తున్న భీమవరం టాకీస్ అధినేత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "బ్రాహ్మణ" చిత్రం కన్నడలో కంటే తెలుగులో మరింత పెద్ద విజయం సాధించడం ఖాయమన్నారు.

రవిశంకర్, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన "బ్రాహ్మణ" చిత్రానికి సినిమాటోగ్రఫి: వెంకట ప్రసాద్, ఎడిటర్: వినోద్ మనోహర్, సంగీతం: మణిశర్మ, సహనిర్మాత: గుంటూరి కేశవులు నాయుడు, సమర్పణ: సి.ఆర్.మనోహర్, నిర్మాతలు: విజయ్.ఎం- గుర్రం మహేష్ చౌదరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రాజు !!

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%