Swadesh Group invites applications to build Swadesh Movie theaters and Swadesh Malls

స్వదేశ్ సినిమా థియేటర్లు, స్వదేశ్ మాల్ ల నిర్మాణం కొరకు దరఖాస్తులకు ఆహ్వానం - స్వదేశ్ గ్రూప్

వ్యవసాయం, సినిమా, వినోద రంగం, కమ్యూనికేషన్స్ మరియు తయారీ తదితర పారిశ్రామిక రంగాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూ శరవేగంగా దూసుకుపోతున్న స్వదేశ్ గ్రూప్ సంస్థల నుంచి ఈ క్రింద వివరించబడిన వాటికి ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 30 వేల నుంచి 50 వేల వరకు జనాభా కలిగిన అన్ని మండలాలు వ్యాపార కేంద్రాలలో స్వదేశ్ సినిమాస్, స్వదేశ్ మాల్స్ స్థాపించుటకు అవసరం అయిన స్థలం ఉన్న భూమి యజమానుల నుంచి అద్దె మరియు అమ్మకాలు లేదా వ్యాపార భాగస్వామ్య పద్ధతిలో ఆసక్తి వ్యక్తీకరణ కోసం దరఖాస్తులు చేసేందుకు అర్హులు. ఈ స్థలము ప్రజలకి మరియు రాకపోకలకు అనుగుణంగా అన్ని కనీస వసతులతో ప్రధాన రహదారికి దగ్గరలో ఉండాలి. ప్రస్తుతం నడుస్తున్న సినిమా థియేటర్స్ వారు కూడా దరఖాస్తు చేయ్యెచ్చు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని స్వదేశ్ ప్రాజెక్ట్స్ ఈవో చంద్రశేఖర్ పొట్టూరి ఒక ప్రకటనలో తెలియజేశారు... ఆయన మాట్లాడుతూ.... సినిమా రంగంలో క్రియేటివిటీ మరియు నైపుణ్యం కలిగిన భారతీయులని ప్రపంచానికి పరిచయం చేయాలని, ఔత్సాహిక నిర్మాతలు, దర్శకులు, నిర్మాణ సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో స్వదేశ్ గ్రూప్ రూ.1000 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు మరియు దక్షిణ భారత కళారంగలో ఉన్న మరియు రాదలుచుకున్న నిర్మాతలకు అర్హతానుసారం 20 నుంచి 80 శాతం వరకు భాగస్వామ్య పద్ధతిలో స్వదేశ్ గ్రూప్ పెట్టుబడి పెడుతుంది. సినిమా, టీవీ, డ్రామా మరియు ఇతర వినోద రంగాల్లో ఉన్న, రాదల్చుకున్న కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఆర్థిక చేయాతనిస్తూ వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి రూ.100 కోట్లతో స్వదేశ్ కళానిధి (రివాల్వింగ్ ఫండ్) ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తింపు కలిగిన సంఘంలో సభ్యులైనవారు 6 నెలలపాటు ఈ నిధి నుంచి లోన్ పొందడానికి అర్హులు. ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి రొటేషన్ పద్ధతిలో సహకారం లభిస్తుంది.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మా మాల్స్ నిర్మాణంలో భాగస్వామ్యం కొరకు అనుభవమున్న సివిల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కాంట్రాక్టర్స్, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్, ప్రీ ఫాబ్ సిమెంట్ బ్లాక్ మూన్యుఫాక్చరర్స్, లాజిస్టిక్స్, మా వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలతో ఇంటర్నెట్ లో మా www.swadeshbank.com/notifications లో అప్లై చేయండి. మెయిల్ చేయాల్సిన ఐడి info@swadeshbank.com, టోల్ ఫ్రీ - 1800 599 8888. నమోదు చేసుకున్న ప్రతీ ఒక్కరికి రూ.10,000 నుంచి 25,000 విలువ కలిగిన స్మార్ట్ ఫోన్, మొబైల్ కనెక్షన్ మరియు 500 ఎంబి 3జి, 4జి డేటా, గ్రూప్ లో ఫ్రీగా మాట్లాడే అవకాశంతో 3 నెలలు ఉచితంగా ఇవ్వబడుతోంది. అని అన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%