హ్యాట్రిక్ సక్సెస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, లరిస్సా బోన్సి, మన్నార చోప్రా జంటగా, సునీల్ రెడ్డి దర్శకత్వంలో, డాక్టర్. సి.రోహిన్ రెడ్డి నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపోందిస్తున్న చిత్రం 'తిక్క' రెండు పాటల మినహ టాకీ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యెక్క మోషన్ పోస్టర్ ని జూన్ 25న విడదల చేయనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్.ఎస్.థమన్ సంగీత సారథ్యంలో అందించిన సూపర్బ్ ఆడియో ని జులై మెదటి వారంలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అతి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదలచేసి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని జులై మూడవ వారంలో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత డాక్టర్.సి.రోహిన్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న చిత్రం 'తిక్క' మోషన్ పోస్టర్ ని జూన్ 25న విడుదల చేయనున్నాము. మోషన్ పోస్టర్ ని కొత్తగా చేశాము, అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకుడు. లరిస్సా బోన్సి, మన్నార చోప్రాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో వున్న మా చిత్రం మరో రెండు సాంగ్స్ చిత్రీకరణతో పూర్తవుతుంది. థమన్ అందించిన ఆడియో అటు మెగా అభిమానులకే కాకుండా సామన్య సినీ లవర్స్ కూడా విపరీతంగా నచ్చుతుంది. మా హీరో సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ కి సరపోయో ఆడియో థమన్ అందించాడు. అతిత్వరలో టీజర్ ని విడుదల చేసి ఆడియోని మెగా అభిమానుల సమక్షంలో జులై మెదటి వారంలో విడుదల చేయనున్నాము. శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ జరుపుకుంటున్న మా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులై మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా 'తిక్క' చిత్రం వుంటుందని ఆశిస్తున్నాము. అని అన్నారు.
నటీనటులు..
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, లరిస్సా బోన్సి, మన్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ఆలి, సప్తగిరి, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, అజయ్, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, సత్య, ఆనంద్, వి.జే.భాని, కామ్నా సింగ్ నటించగా..
టెక్నిషియన్స్..
నిర్మాత- డాక్టర్.సి.రోహిన్ రెడ్డి,
దర్శకత్వం- సునీల్ రెడ్డి,
సహనిర్మాత-కిరణ్ రంగినేని,
కెమెరా- కె.వి.గుహన్
సంగీతం- ఎస్.ఎస్.థమన్
ఎడిటర్- కార్తీక్ శ్రీనివాస్
ఆర్ట్- కిరణ్ కుమార్
కథ- షేక్ దావూద్
మాటలు- హర్షవర్దన్
డాన్స్- ప్రేమ్ రక్షిత్
యాక్షన్- విలియమ్ ఓ.ఎన్.జి, రామ్-లక్ష్మణ్, రవివర్మ, జష్వా.
This website uses cookies.