ఎమ్.జి. మీడియా వర్క్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఓ పాప్ ఆల్బమ్ రూపుదిద్దుకోనుంది. ఉదయకుమార్ డంకా నిర్మాతగా..భాస్కర్ బిందాస్ దర్శకత్వంలో జయవర్ధన్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ పాప్ ఆల్బమ్ జూన్ 20వ తేదీ, సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ..ఎమ్.జి. మీడియా వర్క్స్ బ్యానర్‌లో తొలిసారిగా మేము చేస్తున్న ప్రయత్నమిది. ప్రముఖ సింగర్స్ మరియు ప్రముఖ నటీనటులతో మొట్టమొదటిసారిగా తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ ఆల్బమ్ రూపుదిద్దుకోనుంది. ఆగస్ట్ నాటికి ఆల్బమ్‌ను రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. మా ఈ తొలి ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..అని అన్నారు.
This website uses cookies.