సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం కబాలి. రజనీకాంత్ సరసన రాధికా అప్టే హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జూన్ 26న నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా....
చిత్ర నిర్మాతలు కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ "రజనీకాంత్ గారికి కేవలం ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలవుతుందంటే అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంటుంది. సినిమా ప్రారంభమైన రోజు నుండే సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తి అందరిలో ఉటుంది. ఆయన సినిమాలు తెలుగు, తమిళంలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కబాలిగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, టీజర్ యూ బ్యూబ్, సోషల్ మీడియాలో సరికత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇటువంటి గొప్ప చిత్రాన్ని మా బ్యానర్ లో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. టీజర్‌లో రజనీ చెప్పిన డైలాగులకు, స్టయిల్ కు ఆడియెన్స్ నుండే కాదు, ఇండస్ట్రీ వర్గాల నుండి కూడా ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. అంతకన్నా గొప్ప డైలాగులు, అభిమానులకు కిక్కెచ్చించే డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. పా రంజిత్ సినిమాను ఎక్స్ ట్రార్డినరీగా తెరకెక్కించారు. రజనీకాంత్ లోని మరో కోణాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత గొప్ప దర్శకుల్లో ఒకరిగా పా.రంజిత్‌కు పేరు వస్తుంది. సంతోష్ నారాయణ్ చాలా మంచి బాణీలిచ్చారు. సూపర్‌స్టార్ అభిమానులే కాదు మ్యూజిక్ లవర్స్ అందరూ మళ్లీ మళ్లీ వినేలా బాణీలు కుదిరాయి. రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరాం, వనమాలి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. సాహితి ఈ చిత్రానికి మాటలు అందించారు. ఈ సినిమా పాటలను జూన్ 26న గ్రాండ్ లెవల్లో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారు. తెలుగు, తమిళంలో సినిమాను జూలై నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: మురళీ, సంగీతం: సంతోష్ నారాయణ్, ఆర్ట్: రామలింగం, ఫైట్స్: అన్బరివు, మాటలు: సాహితి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, వనమాలి. మేకప్: భాను, ఎఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవి-శ్రీదేవి
సతీష్, సమర్పణ: కలైపులి థాను, నిర్మాతలు: కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్, దర్శకత్వం: పా రంజిత్.
This website uses cookies.