‘Sahasam Swaasaga Saagipo’ audio launched

సాహసం శ్వాసగా సాగిపో పాటలు విడుదల చేసిన అక్కినేని నాగార్జున, ఎ.ఆర్.రెహమాన్, గోపీచంద్

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’. చైత‌న్య స‌ర‌స‌న ఈ చిత్రంలో మంజిమ మోహ‌న్ న‌టించింది. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన‌ ఈ చిత్రాన్ని  స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో  ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై యం.ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు.  ఆస్కార్ అవార్డ్ విన్నర్  ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించిన  ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో జ‌రిగింది. నాగార్జున‌, గోపీచంద్ సాహసం శ్వాస‌గా సాగిపో బిగ్  సిడీను ఆవిష్క‌రించగా, ఎ.ఆర్. రెహ‌మాన్ ఆడియో సిడీను ఆవిష్క‌రించారు. డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ..

సాహసం శ్వాసగా సాగిపో అనే టైటిల్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను సాహసం చేస్తేనే ఇక్కడకు రాగలిగాను

కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘’ఎ.ఆర్.రెహ‌మాన్ గారి సంగీతం ఎక్క‌డికో తీసుకెళ్లిపోయింది. మ‌ర‌చిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఆడియో ఫంక్ష‌న్ లో ఇంత రెస్పాన్స్ చూడ‌లేదు. నెల రోజుల క్రితం చైత‌న్య ఈ సినిమా పాట‌లు విన‌మ‌ని సిడీ తెచ్చి ఇచ్చాడు. పాట‌లు విన్నాను అయితే... వెళ్లిపోమాకే అనే పాట వింటుంటే నాకు తెలియ‌కుండానే క‌ళ్ల‌ల్లో నీళ్లు వ‌చ్చాయ్. గౌత‌మ్ మీన‌న్ త‌న విజువ‌ల్స్ తో మ‌న‌ల్ని ఎక్క‌డితో తీసుకెళ్లిపోయారు. ఈ పాట‌లు వింటుంటే నేను ఈ పాట‌ల్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఎ.ఆర్.రెహ‌మాన్ నాతో ఒక సినిమానే చేసినా.... చైత‌న్య‌తో రెండు సినిమాలు చేసినందుకు హ్యాఫీగా ఉంది. ఏమాయ‌చేసావే పాట‌ల్ని ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియ‌దు. రెహ‌మాన్ ఎక్క‌డి నుంచి ఏస్ధాయికి ఎదిగారో త‌లుచుకుంటే అంద‌రికీ ఒక ఇన్ స్పిరేష‌న్ లా ఉంటుంది. భార‌తీయులంద‌రూ రెహ‌మాన్ చూసి గ‌ర్వ‌ప‌డుతుంటాం. గౌత‌మ్ మీన‌న్ నాతో సినిమా చేస్తానంటాడు. కానీ చేయ‌డం లేదు. ఒక‌సారి క‌లిసి నెగిటివ్ రోల్ చేస్తారా అని అడిగాడు. మీ డైరెక్ష‌న్ లో అయితే చేస్తాను అన్నాను. మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. నాతో చేయ‌క‌పోయినా చైత‌న్య‌తో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నేను బాగా న‌మ్మేదే ఈ సినిమా టైటిల్ సాహ‌సం శ్వాస‌గా సాగిపో.  ఈ సినిమా బిగ్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దేవుడు,తల్లిదండ్రులు, అభిమానులు ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నాను

ఎ.ఆర్.రెహ‌మాన్ మాట్లాడుతూ ‘’నాకు మంచి టీమ్ ఉంది. అలాగే సింగ‌ర్స్ అంద‌రూ చాలా బాగా పాడారు. గీత ర‌చ‌యిత‌లు మంచి సాహిత్యాన్ని అందించారు.  నేను ఇంత మంచి మ్యూజిక్ అందించ‌డానికి గౌత‌మ్ మీన‌న్ గారి విజువ‌ల్స్ న‌న్ను ఇన్ స్పైర్ చేసాయి. దీంతో కొత్త‌గా ట్రై చేసాం. అందుకే మ్యూజిక్ లో రిచ్ నెస్ క‌నిపిస్తుంది.  దేవుడు ఆశీస్సులు, అభిమానులంద‌రి ఆశీస్సులు ఉండ‌డం వ‌ల‌నే ఈస్ధాయిలో ఉన్నాను అనుకుంటున్నాను’’ అన్నారు.

ఈ సినిమాకు మరో కొత్తదారిని చూపిస్తుంది

నాగ చైత‌న్య మాట్లాడుతూ ‘’రెహ‌మాన్ గారితో వ‌ర్క్ చేయ‌డం అనేది ఎవ‌రికైనా ఒక డ్రీమ్. అలాంటిది గౌత‌మ్ సార్ నాకు రెహ‌మాన్ గారితో వ‌ర్క్ చేసే అవ‌కాశం రెండు సార్లు  ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. నాకు స‌క్సెస్ ఇచ్చిన డైరెక్ట‌ర్స్ తో మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌ర్క్ చేయాలి అని కోరుకుంటాను. గౌత‌మ్ సార్ తో వ‌ర్క్ చేయ‌డం వ‌ల‌న చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఈ జ‌ర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. ఏమాయ చేసావే నాకు ల‌వ్ స్టోరీస్ బాగుంటాయి అని ఒక కొత్త దారి చూపించింది. సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా మ‌రో కొత్త‌దారి చూపిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

అన్నయ్య నమ్మితేనే చేస్తాడు

అక్కినేని అఖిల్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలోని పాట‌ల‌ను సింగ‌ర్స్ చాలా బాగా పాడారు. మా అన్న‌య్య ఏదైనా న‌మ్మితేనే చేస్తాడు. సో..ఈ సినిమా ఖ‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది. ఏమాయ చేసావే చూసిన త‌ర్వాత ల‌వ్ అంటే రొమాన్సే కాదు అందులో యాక్ష‌న్ కూడా ఉంటుంది అని తెలుసుకున్నాను. సాహ‌సం శ్వాస‌గా సాగిపో చూసిన త‌ర్వాత ప్రేమ అంటే ఏమిటో పూర్తిగా తెలుస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు.

మూవీ పెద్ద సక్సెస్ కావాలి

హీరో గోపీచంద్ మాట్లాడుతూ ‘’ఈ చిత్ర నిర్మాత నాకు మంచి స్నేహితుడు. స్టైలీష్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ని ఐదు సంవ‌త్స‌రాల క్రితం క‌లిసాను. ఇప్పుడు ఇలా ఈ వేడుక‌లో క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్, టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్  ఎ.ఆర్.రెహ‌మాన్ మ్యూజిక్ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీ ట్రైల‌ర్ లో చైత‌న్య లుక్ చాలా బాగుంది. సాహ‌సం శ్వాస‌గా సాగిపో పెద్ద స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

గీతాంజలిలో నాగార్జునగారిని చూస్తున్నట్లు అనిపిస్తుంది

డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ ‘’గౌత‌మ్ మీన‌న్ సినిమాలంటే ఇష్టం. అందుకే ఆయ‌నంటే నాకు గౌర‌వం. ట్రైల‌ర్ లో చైత‌న్య‌ని చూస్తుంటే గీతాంజ‌లిలో నాగార్జున గార్ని చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద స‌క్సెస కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చైతన్యకు చేస్తున్న విషయాలపై క్లారిటీ ఉంటుంది

నిర్మాత ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘’ఈ ఆడియో వేడుక‌ను ఆకాశ‌మంత పందిరి వేసి గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. కానీ..కుద‌ర‌లేదు. ఈ సినిమా గురించి నిర్మాత‌గా నేను చెప్ప‌డం క‌న్నా డైరెక్ట‌ర్ గౌత‌మ్ గారు చెబితేనే బాగుంటుంది. సినిమా స్టార్ట్ చేసి 14 నెల‌లు అవుతున్నా..మా హీరో చైత‌న్య మేము ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు మాకు టైమ్ ఇచ్చేవాడు. చైత‌న్య‌లో ఉన్న గొప్ప విష‌యం ఏమిటంటే...ఏ విష‌యం పైన అయినా ఫుల్ క్లారిటీ ఉంటుంది. స‌క్సెస్ ఫుల్ మేన్స్ అంద‌రూ అలాగే ఉంటారేమో అనిపిస్తుంటుంది.  గౌత‌మ్ మీన‌న్ గారు ప‌రిచ‌యం చేసిన స‌మంత ఏస్ధాయికి వెళ్లిందో మంజిమ మోహ‌న్ కూడా అలాగే స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చైతన్య జెంటిల్ మేన్

డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ మాట్లాడుతూ ‘’ఈ ఆడియో ఫంక్ష‌న్ చూస్తుంటే చాలా హ్యాఫీగా, ప్రౌడ్ గా ఉంది. ఎ.ఆర్.రెహ‌మాన్ అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. చైత‌న్య జెంటిల్ మెన్. కోన వెంక‌ట్ అండ్ టీమ్ అంద‌రికీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను’’ అన్నారు.

సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను

చిత్ర స‌మర్ప‌కుడు కోన వెంక‌ట్ మాట్లాడుతూ ‘’ఎ.ఆర్.రెహ‌మాన్, గౌత‌మ్ మీన‌న్ లాంటి గొప్ప వ్య‌క్తుల‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. చైత‌న్య‌, మంజిమా మోహ‌న్ ఏం మాయ చేస్తారో అని అంద‌రిలాగే నేను కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.

నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ ‘’రెహ‌మాన్ సంగీతం అద్భుతంగా ఉంది. రెహ‌మాన్ మ్యూజిక్ విన్న ప్ర‌తిసారి అవుట్ స్టాండింగ్ ఫీలింగ్ క‌లుగుతుంది. టీమ్ అంద‌రికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ ’’రెహ‌మాన్ గారి సంగీతం అద్భుతంగా ఉంది. ఎంత‌గానో ఇన్ స్పైర్ చేసింది. చైత‌న్య త‌న‌కంటూ ఓ రూటు ఏర్ప‌రుచుకున్నాడు.  ఏమాయ చేసావే క‌న్నా పెద్ద స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, డైరెక్ట‌ర్ అనిల్ ర‌విపూడి, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌,  ద‌శ‌ర‌థ్, నిర్మాత దాన‌య్య‌, డైరెక్ట‌ర్ బాబీ, గీత ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య‌, అనంత శ్రీరామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య, మంజిమ మోహన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌,ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన, సమర్పణ: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%