తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్స్ అరుదుగా కనిపిస్తుంటారు. కానీ ఇటీవ కాలంలో తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్స్‌గా బాగానే రాణిస్తున్నారు. తాజాగా ‘రెండక్షరాలుచిత్రంలో వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా నటించిన ‘వాసవి’ కూడా తెలుగమ్మాయేకావడం విశేషం. ‘రెండక్షరాలు
చిత్రం ఈ నె 10న విడుదలైంది. ఈ చిత్రంలో తన పాత్రకు విశేషమైన స్పందన లభిస్తోన్న సందర్భంగా తన ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకుంది అచ్చ తెలుగు అమ్మాయి వాసవి. ఆ విశేషాలు ఆమె మాటల్లో..
మీ నేపథ్యం?
మాది కడప జిల్లా. ఇటీవలే నేను బి.కాం కంప్యూటర్స్ పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను సినిమా ఫీల్డ్‌వైపు వచ్చేలా చేసింది. ‘ఆ ఇంట్లో ఎవరూ లేరు’ అనే సినిమాలో తొలిసారిగా హీరోయిన్‌గా నటించా. ‘రెండక్షరాలునా రెండవ సినిమా. కానీ నా రెండో సినిమా ‘రెండక్షరాలు
ముందుగా రిలీజైంది.
‘రెండక్షరాలు` చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది, మీ పాత్రకు వస్తున్న స్పందన ఎలా ఉంది?
ఈ చిత్రంలో నా పాత్ర పేరు కళంకిత. కాలేజ్ స్టూడెంట్‌గా నటించా. ఫస్టాఫ్‌లో నా క్యారెక్టర్ చాలా బబ్లీ బబ్లీగా ఉంటుంది. సెకండాఫ్‌లో సింపతీ వర్కవుట్ అయ్యే పాత్ర చేశా. మూవీ చూసిన వారందరూ చాలా బాగా చేశావంటూ ఫోన్ చేస్తుంటే ఆనందంగా ఉంది. నా ఫస్ట్ మూవీకే పాజిటివ్ రెస్పాన్స్ రావడం లక్కీగా భావిస్తున్నా. పర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర చేసే అవకాశం కల్పించిన మా నిర్మాత పైలా దేవదాస్‌రెడ్డి గారికి, దర్శకుడు శ్రీనివాసరావు గారికి థాంక్స్ చెప్పుకుంటున్నా,..
‘రెండక్షరాలుచిత్రంలో మీకు నచ్చిన అంశం?</strong>
టైటిల్ విషయానికొస్తే... అమ్మ, నాన్న, అన్న, అక్క, అత్త, ప్రేమ ఇలా సృష్టిలో గొప్ప గొప్ప రిలేషన్స్ అన్నీ కూడా రెండక్షరాలతో ప్రారంభమవుతాయి.. కాబట్టి ‘రెండక్షరాలు`’ అనే టైటిల్ పెట్టాము. సినిమా చూసిన వారందరూ కాన్సెప్ట్‌కి తగ్గ టైటిల్ అంటున్నారు.
ప్రేమికులు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ వారి అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమికుల పరిస్ధితి ఏమిటి? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ అంశం నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. ప్రజంట్ ట్రెండ్‌కి కనెక్టయ్యే కథ. ఇక ‘రెండక్షరాలు
హీరోయిన్‌గా మీకు ఇన్‌స్పిరేషన్?
అనుష్క, కాజల్ అంటే నాకు చాలా ఇష్టం. వీరే నాకు ఇన్‌స్పిరేషన్. ‘అరుంధతి’ సినిమాలో అనుష్కగారిలాంటి పాత్ర చేయాన్నది నా డ్రీమ్.
మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది?
మొదట్లో మా కుటుంబ సభ్యులు సినిమా ఫీల్డ్‌కి వద్దంటే వద్దన్నారు. కానీ ‘రెండక్షరాలు’ సినిమా చూశాక వారికి ఓ నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
లారా, గోవా బీచ్ రోడ్ అలాగే తమిళంలో ఓ సినిమా చేస్తున్నా.
గ్లామర్ పాత్రకైనా సిద్ధమేనా?
పర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చేయడానికైనా సిద్ధమే.
‘రెండక్షరాలు` టీమ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
లోకేష్‌రెడ్డి, అక్షర, నేను, కిరణ్ ఇందులో రెండు ప్రేమ జంటులుగా నటించాం. అందరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ప్రతి పాత్ర సినిమాకు ఎంతో కీలకం. దర్శకుడు శ్రీనివాసరావుగారు నన్ను ఫేస్‌బుక్‌లో చూసి ఆడిషన్‌కి పిలిపించి హీరోయిన్‌గా సెక్ట్ చేశారు. మా నిర్మాత పైలా దేవదాస్‌రెడ్డి గారు ఏ విషయంలో రాజీపడకుండా నిర్మించారు. గ్రాండ్‌గా రిలీజ్ చేశారు అంటూ ముగించింది అచ్చ తెలుగమ్మాయి వాసవి.
This website uses cookies.