Ayushman Bhava movie pooja held

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రావు, శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా
'ఆయుష్మాన్ భ‌వ 'చిత్రం పూజాకార్య‌క్ర‌మాలు

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌, ల‌వ‌ర్స్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ అందించిన మారుతిటాకీస్ ప్రోడ‌క్ష‌న్ నెం-12 చిత్రం గా నిర్మిస్తున్న చిత్రం ఆయుష్మాన్ భ‌వ. ఈ రోజు ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కులు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రావు, శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా శ్రీ సాయిబాబా మందిరంలో పూజాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. సినిమా చూపిస్తా మామా లాంటి సూప‌ర్‌హిట్ ద‌ర్శ‌కుడు  త్రినాధ్ రావు న‌క్కిన క‌థ‌ని సిద్దంచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మారుతి టికీస్ తో పాటు శ్రీ సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర సిని క్రియోష‌న్స్ సంయుక్త‌గా నిర్మిస్తున్నారు.  మారుతి మ‌రియు జి.సుబ్ర‌మ‌ణ్యం లు నిర్మాత‌లు. భ‌ద్రం బీకేర్ ఫుల్ చిత్రంతో న‌టుడు గా మార్క్స్ సంపాయించిన చ‌ర‌ణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నారు. అతిత్వ‌ర‌లో ఈ చిత్రం సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత జి.సుబ్ర‌మ‌ణ్యంం మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు త్రినాధ రావు న‌క్కిన చెప్పిన క‌థ నాకు న‌చ్చింది. సినిమా చూపిస్తా మామ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంతో ఎన‌ర్జిటిక్ స‌క్సస్ ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు మా చిత్రానికి క‌థ  సిద్దంచేయ‌టం చాలా ఆనందంగా వుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ట్రెండ్ ద‌ర్శ‌కుడు మారుతి గారితో క‌లిసి మారుతి టాకీస్ బ్యాన‌ర్ పై నిర్మించ‌టం మాకు చాలా ఆనందంగా వుంది. చ‌క్క‌టి క‌థ కి మారుతి గారి లాంటి సూప‌ర్బ్ డైర‌క్ట‌ర్ తోడ‌వ‌టం మా అదృష్టంగా భావిస్తున్నాము. మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో ఇటీవ‌లే విడుద‌ల‌య్యిన భ‌ద్రం బీ కేర్‌ఫుల్ చిత్రంతో హీరోగా చాలా మంచి మార్క్స్ వేసుకున్న చ‌ర‌ణ్ తేజ్ మా చిత్రం లో హీరోగా న‌టిస్తున్నాడు. త‌న మెద‌టి చిత్రంతోనే మారుతి లాంటి ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర మార్స్క్ కొట్టేయ‌టంతో రెండ‌వ‌సారి అవ‌కాశం సంపాయించాడు. మా చిత్రానికి ఆయుష్మాన్ భ‌వ అనే టైటిల్ ఖ‌రారు చేశాము. టైటిల్ లో ఎంత డెప్ట్ వుందో చిత్ర క‌థ కూడా ఆదే రేంజి లో త్రినాధ రావు గారు అందిచారు. ఈరోజు ఫిల్మ్‌న‌గ‌ర్ సాయిబాబా టెంపుల్ లో ఈ చిత్రానికి సంబందించిన స్క్రీప్ట్ పూజాకార్క‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ కార్క‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కులు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రావు, శ్రీకాంత్ అడ్డాల ముఖ్యఅతిధులుగా హ‌జ‌ర‌య్యారు. మాచిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మాట‌లు కూడ అందించ‌నున్నారు. మెత్తం వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం. అని అన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.