"హైదరాబాద్ తల్వార్స్" ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి !!
-ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో 'తలసీమియా' ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారు మూడు వారాలకొకసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించుకోవాలి. లేని పక్షంలో వ్యాధి మరింత ముదిరి మరణం చేరువవుతుంది. తలసీమియా వ్యాధిగ్రస్తుల సహాయార్ధం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా 'హైదరాబాద్ తల్వార్స్' (సెలబ్రటీ క్రికెట్ టీం) బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించింది హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం చాంబర్ ఇందుకు వేదికయ్యింది. జూన్ 14 మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ క్యాంప్ జరిగింది. డిల్లీలో తెలంగాణా ప్రభుత్వ సంచాలకులు రామచంద్రు, ఐ.ఎ.ఎస్. సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, డి.సురేష్ బాబు, బి.గోపాల్, లగడపాటి శ్రీధర్, మధుర శ్రీధర్ రెడ్డి, ఆర్.పి. పట్నాయక్, శివారెడ్డి, లోహిత్, శాని, శ్రీధర్ రావు, రచ్చ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. " తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హైదరాబాద్ తల్వార్స్ చైర్మన్ అభినవ సర్దార్ బృందాన్ని మరియు రక్తదాతలను వారు ఎంతగానో అభినందించారు. ముఖ్యంగా "హైదరాబాద్ తల్వార్స్"ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సురేష్ బాబు తదితరులు పేర్కొన్నారు !!