Social News XYZ     

Rudra IPS releasing on June 17th

జూన్‌ 17న 'రుద్ర ఐపిఎస్‌' విడుదలకు సిద్ధం

Rudra IPS releasing on June 17th

రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా అజిత్‌ క్రియేషన్స్‌ పతాకంపై టి. కృష్ణవేణమ్మ సమర్పణలో బాలకృష్ణ రెడ్డి దర్శకత్వంలో టి. రాజశేఖరరెడ్డి నిర్మించిన చిత్రం 'రుద్ర ఐపిఎస్‌'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 17న విడుదలకు రెడీగా ఉంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టి. రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ..'రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. దర్శకుడు బాలకృష్ణ రెడ్డి..ఈ మూవీని..చెప్పిన విధానం కంటే తీసిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. రాజ్‌కృష్ణ, కీర్తనల నటన ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ముఖ్యంగా టైటిల్‌ రోల్‌లో రాజ్‌కృష్ణ నటన ప్రేక్షకులతో క్లాప్స్‌ కొట్టిస్తుంది. ఇప్పటికే మా సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది. స్క్రీన్‌ప్లే హైలైట్‌గా సాగే ఈ చిత్రానికి వంశీకృష్ణ ఫోటోగ్రఫీ మరో ఎస్సెట్‌. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్‌ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..అని అన్నారు.

 

రాజ్‌కృష్ణ, కీర్తన, చంద్రమోహన్‌, చిత్రం శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్‌: విజయకృష్ణ, స్టంట్స్‌: మార్షల్‌ రమణ, ఎడిటర్‌: నందమూరి హరి, సంగీతం: ఘంటాడి కృష్ణ, డిఓపి: వంశీకృష్ణ.పి, సమర్పణ: టి. కృష్ణవేణమ్మ, నిర్మాత: టి. రాజశేఖరరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బాలకృష్ణ రెడ్డి.

Facebook Comments

%d bloggers like this: