అమ్మోరు, అరుంధతి వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న మరో అద్భుత చిత్రం 'నాగభరణం'. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం అనేది ఒక వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్ మూవీస్, ఇన్‌బాక్స్ పిక్చర్స్, బ్లాక్‌బస్టర్ స్టూడియో పతాకాలపై జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సొహైల్ అన్సారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సొంతం చేసుకున్నారు. స్టూడియో గ్రీన్ కె.ఇ. జ్ఞానవేల్‌రాజా సమర్పణలో 'నాగభరణం' చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ - ''ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్. బాహబలి చిత్రానికి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేసిన మకుట ఈ చిత్రానికి కూడా వండర్‌ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్‌ని చేస్తున్నారు. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటాయి. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మా స్టూడియో గ్రీన్ ద్వారా అందించడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన సాజిద్ ఖురేషి మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కోడి రామకృష్ణగారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 'నాగభరణం' విజువల్‌గా ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం'' అన్నారు.
కోడి రామకృష్ణ మాట్లాడుతూ - ''పూర్వజన్మలో ఓ అమ్మాయి పొగొట్టుకున్న ఎమోషన్‌ను ఎలా సాధించిందనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. విజువల్‌గా మేం అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మరో అద్భుతమైన చిత్రాన్ని చూడబోతున్నారు'' అన్నారు.
రమ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంత్, ముకుల్ దేవ్, రవి కాలే, అమిత్, రాజేష్ వివేక్, సాదు కోకిల, రంగాయన రఘు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విఎఫ్.ఎక్స్: మకుట విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్: రవివర్మ, థ్రిల్లర్ మంజు, ఆర్ట్: నాగరాజ్, కొరియోగ్రాఫర్: చిన్ని ప్రకాష్, శివశంకర్, ఇమ్రాన్ సర్దారియా, సాహిత్యం: కవిరాజ్, డైలాగ్స్: ఎం.ఎస్.రమేష్, ఎడిటర్: జానీ హర్ష, సినిమాటోగ్రఫీ: వేణు, మ్యూజిక్: గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలావుద్దీన్ యూసఫ్, ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్: సాజిద్ ఖురేషి, సమర్పణ: స్టూడియో గ్రీన్ కె.ఇ. జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: కోడి రామకృష్ణ.
This website uses cookies.