Social News XYZ     

Lord Shiva Creation in Second Schedule

రెండో షెడ్యూల్ చిత్రీకరణలో లార్డ్ శివ క్రియేషన్స్ చిత్రం

Lord Shiva Creation in Second Schedule

లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై సాక్షిచౌదరి ప్రధాన తారాగణంగా పర్వీన్ రాజ్, పూజిత హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా....

దర్శకుడు శేషసాయి మరుప్రోలు మాట్లాడుతూ ‘’సినిమా చిత్రీకరణలో భాగంగా రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ లో పర్వీన్ రాజ్, పూజితల మీద మంచి లోకేషన్స్ లో సాంగ్ చిత్రీకరించాం. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ప్రధానపాత్రలో నటిస్తున్న సాక్షిచౌదరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జూన్ నెలాఖరుకు ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ప్రస్తుత సమాజంలో యువత ఎలా ఉందనే కాన్సెప్ట్ పై రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమాను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు.

 

నిర్మాత ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సాక్షిచౌదరి ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు షెడ్యూల్ లో ఆమెపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నాం’’ అన్నారు.

సాక్షిచౌదరి, పర్వీన్ రాజ్, పూజిత, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాకేష్, సంతోష్, ఇంద్ర, అవంతిక, అక్షర, శ్రావణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, సంగీతం: కిషన్ కవాడియా, కెమెరా: కె.శంకరరావు, నిర్మాత: ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి, రచన, దర్శకత్వం: శేషసాయి మరుప్రోలు

Facebook Comments

%d bloggers like this: