Social News XYZ     

A..Aa Success Celebrations on June 12th in Guntur

జూన్ 12 న గుంటూరు  లో  వైభవంగా 'అఆ' విజయోత్సవ వేడుక

A..Aa Success Celebrations on June 12th in Guntur

మాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్ లతో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన 'అఆ' చిత్రం ఘన విజయం సాధించిన విషయం విదితమే.

ఈ చిత్రం సాధించిన ఘన విజయం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 న గుంటూరు లో 'అఆ' విజయోత్సవ వేడుకను జరుపనున్నట్లు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన  గుంటూరు లోని 'సిద్ధార్ధ గార్డెన్స్' లో ఆదివారం (జూన్ 12) సాయంత్రం 7 గంటలకు  జరిగే ఈ విజయోత్సవ వేడుకలోమాటల మాంత్రికుడు,దర్శకుడు 'త్రివిక్రమ్' హీరో నితిన్,సమంత,అనుపమ.నదియ,నరేష్,రావు రమేష్ ,అజయ్,హరితేజ, శ్రీనివాస రెడ్డి,ప్రవీణ్,మధునందన్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, ల తో పాటు పలువురు నటీ నటులు, సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయనాయకులు పాల్గొంటున్నట్లు నిర్మాత తెలిపారు.

 

Facebook Comments